ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పై కన్నెర్రజేసిన శిఖర్ ధావన్.. ఇంత ఘోరం గా ఎవరు ఎప్పుడు చేసి వుండరు

ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ పై కన్నెర్రజేసిన శిఖర్ ధావన్.. ఇంత ఘోరం గా  ఎవరు ఎప్పుడు చేసి వుండరు 


ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ తీరుపై భారత బ్యాట్స్మెన్ శిఖర్ ధావన్ అసంతృప్తిని వ్యక్తపరిచాడు. శిఖర్ ధావన్ కుటుంబాన్ని ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సంస్థ మధ్యలోనే సంస్థ అడ్డగించింది. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల కోసం భారత టీం శుక్రవారం దక్షిణాఫ్రికాకు చేరుకుంది. కుటుంబంతో కలిసి ముంబై నుంచి మిగతా టీమ్‌తోపాటు కలిసి ధావన్ సౌతాఫ్రికాకు బయలుదేరాడు. అయితే దుబాయ్‌లో కేప్‌టౌన్ విమానం ఎక్కే సమయంలో అతని కుటుంబాన్ని అడ్డుకున్నారు అక్కడి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది. పిల్లల బర్త్ సర్టిఫికెట్లు లేవన్న కారణంగా దక్షిణాఫ్రికా వెళ్లేందుకు వారికి బోర్డింగ్ అనుమతి ఇవ్వలేదు. దీంతో వారు అక్కడే ఉండిపోయారు. ధావన్ ఒక్కడే దక్షిణాఫ్రికా చేరుకున్నాడు.‘‘ఎమిరేట్స్ సంస్థ ప్రవర్తన అసలు ఏం బాగాలేదు. కుటుంబంతో కలిసి దక్షిణాఫ్రికా వెళుతుంటే.. నా భార్య, పిల్లలను మాత్రం అనుమతించలేదు. దుబాయ్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే విమానాన్ని ఎక్కనివ్వలేదు. మా పిల్లల జనన ధ్రువీకరణ (బర్త్ సర్ట్‌ఫికెట్) పత్రాలను అడిగారు. అప్పటికప్పుడు మా దగ్గర అవి లేవు. అదే విషయం వారికి వివరించినా పట్టించుకోలేదు. వాళ్లిప్పుడింకా దుబాయ్ విమానాశ్రయంలోనే ఉన్నారు. ఇలా సర్టిఫికెట్లు అడుగుతారని ముంబైలో మేం విమానం ఎక్కేముందే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఎందుకు చెప్పలేదు? ఓ ఉద్యోగి ప్రవర్తనైతే మరీ దారుణంగా ఉంది. కారణం లేకుండానే చాలా దురుసుగా ప్రవర్తించాడు’’ అని ధావన్ ట్వీట్ చేశాడు. జనవరి అయిదో తేదీ నుండి దక్షిణాఫ్రికాతో మొదటి టెస్ట్ మొదలవనుంది.







Comments