ఒవైసీకి మద్దతు ఇచ్చింది ఇద్దరే ఇద్దరు.. గుజరాత్ లో ఉన్న తన వదిన అంటూ మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఒవైసీ
ఒవైసీకి మద్దతు ఇచ్చింది ఇద్దరే ఇద్దరు.. గుజరాత్ లో ఉన్న తన వదిన అంటూ మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఒవైసీ
లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముందు నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల విషయాల్లో కలుగజేసుకోకూడదని ఆయన సభలోనూ, బయటా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లుకు సంబంధించి లోక్ సభలో ఒవైసీ మూడు సవరణలను ప్రతిపాదించారు. వాటిపై అక్కడ ఓటింగ్ నిర్వహించారు. అయితే కనీస మద్దతు కూడా ఓటింగ్ లో ఒవైసీ గారికి లభించలేదు. కేవలం రెండంటే రెండే ఓట్లు ఆయనకు వచ్చాయి. వ్యతిరేకంగా అంటారా 241 ఓట్లు పడ్డాయి. సభకు హాజరైనవారిలో నలుగురు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.ఈ బిల్లును రూపొందించే సమయంలో కేంద్ర ప్రభుత్వం ముస్లింలను సంప్రదించలేదని ఆయన మండిపడ్డారు. కేవలం ముస్లిం మహిళల గురించే మాట్లాడుతున్నారని, దేశ వ్యాప్తంగా భర్తలు వదిలేసిన 20 లక్షల మంది భార్యల సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ బాధితురాళ్లలో గుజరాత్ లో ఉన్న తన వదిన కూడా ఉన్నారంటూ ప్రధాని మోదీ భార్య గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.అసదుద్దీన్ వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ లోని వారణాసి ముస్లిం మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. రోడ్డుపై అసదుద్దీన్ ఒవైసీ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి అనుకూలంగా నినాదాలు చేశారు.
Comments
Post a Comment