ప్రముఖ దర్శకుడిపై హీరోయిన్ ఆరోపణ! మిస్ యూజ్ చేశాడు
సినిమాల్లో స్పెషల్ సాంగులు ఉండటం సర్వసాధారణం. ఒకప్పుడు వీటిని ఐటం సాంగ్స్ అనేవారు, అవి చేయడానికి సిల్మ్ స్మిత, జయమాలిని, జ్యోతి లక్ష్మి, డిస్కో శాంతి లాంటి తారలు ఉండేవారు. ఈ మధ్య కాలంలో పలువురు టాప్ హీయిన్లు కూడా ఇలాంటి సాంగ్స్‌లో నటిస్తుండటంతో స్పెషల్ సాంగ్స్ అని పిలుస్తున్నారు. ఐటం సాంగులతో పోలిస్తు స్పెషల్ సాంగ్స్‌లో వల్గారిటీ లెవల్స్ కాస్త తక్కువగానే ఉంటుందని చెప్పాలి. తాజాగా ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన హీరోయిన్... సినిమా విడుదలైన తర్వాత దర్శకుడిని బ్లేమ్ చేయడం తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ఇటీవల తమిళంలో విడుదలైన ‘చెన్నై 600028 పార్ట్ 2' చిత్రంలో హీరోయిన్ మనీసా యాదవ్ సోపన్న సుందరి అనే పాత్రను పోషించింది. ఈ చిత్రంలో ఆమెపై ఓ స్పెషల్ సాంగ్ కూడా చిత్రీకరించారు. అయితే ఆమె చేసిన సాంగ్ చాలా వల్గర్‌గా ఉందనే విమర్శలు రావడంతో..... డైరెక్టర్ వెంకట్ ప్రభును తిట్టిపోసే పని పెట్టుకుంది. ఈ సినిమాకు తాను సైన్ చేసే సమయంలో దర్శకుడు, నిర్మాత స్పెషల్ సాంగ్ అని చెప్పారని.... సినిమా విడుదలైన తర్వాత చూస్తే నన్ను ఐటం గర్ల్‌గా చూపించారని, ఈ విషయంలో దర్శకుడు వెంకట్ ప్రభును తనను మోసం చేశారని మనీషా యాదవ్ ఆరోపించారు. డైరెక్టర్ వెంకట్ ప్రభు... సినిమాలో నేను చేసిన సాంగ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పారు. కానీ నన్ను ఇంత చీప్‌గా చూపిస్తారని అస్సలు ఊహించలేదు.... అని మనీషా యదవ్ వాపోయారు. ఒక పెద్ద డైరెక్టర్‌తో సినిమా అవకాశం వచ్చిందని సంతోష పడ్డాను. కానీ ఆయన నన్ను తన సినిమాలో పూర్తిగా మిస్ యూజ్ చేశాడు. తన కెరీర్లో ఇదొక గుణపాఠం లాంటిదని, ఇకపై తన పాత్రల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, ఫ్యూచర్లో ఇలాంటి పాత్రలు, స్పెషల్ సాంగులు అస్సలు చేయను అని మనీషా యాదవ్ తెలిపారు.
Comments
Post a Comment