నా కూతురు అలా…నేనిలా…. త‌రాల మ‌ద్య తేడానే ఇది: ఓ తల్లి ఫీలింగ్స్.

నా కూతురు అలా…నేనిలా…. త‌రాల మ‌ద్య తేడానే ఇది: ఓ తల్లి ఫీలింగ్స్.


మ‌నుషులంద‌రి వ్య‌క్తిత్వాలు ఒకే ర‌కంగా ఉండ‌వు క‌దా. అలాగే నా కూతురు, నేను కూడా ఒక్కొక్క‌రం ఒక్కో ర‌క‌మైన వ్య‌క్తిత్వాల‌ను క‌లిగి ఉన్నాం. ఇద్ద‌రివీ భిన్న‌మైన రుచులు. భిన్న‌మైన అభిప్రాయాలు. ఏదైన గొడ‌వ జ‌రుగుతుందంటే అందులో బాధితుల త‌ర‌ఫున వాదించేందుకు నేనెప్పుడూ వెళ్తుంటాను. కానీ నా కూతురు అలాంటి గొడ‌వ‌ల వ‌ద్ద‌కు వెళ్ల‌వ‌ద్దంటుంది. బ‌తిమాలుతుంది. అది మ‌న ప‌ర్స‌న‌ల్ గొడవ కాదు, మ‌న‌కు సంబంధం లేదు, అలాంట‌ప్పుడు మ‌నం ఎందుకు వెళ్లాలి, అంటుంది. అస‌లు వాటితో మ‌న‌కు ప‌నేముంది, మ‌న ప‌ని మ‌నం చూసుకోవాలి, నువ్వెప్పుడూ అలాంటి గొడ‌వ‌ల వైపుకు వెళ్ల‌వ‌ద్ద‌మ్మా, అంటుంది. నా కూతురు అలా అన‌డం చూస్తే… అసలిది ఏం జ‌న‌రేష‌న్. మ‌నం ఎటువైపు వెళ్తున్నాం. ఈ జ‌న‌రేష‌న్ నా మ‌నం కోరుకుంది, అనిపిస్తుంటుంది.
ఇప్పటి త‌రం యువ‌త‌ను అప్ప‌టి త‌రం వారిని చూస్తే నాకు కొన్ని విష‌యాలు గుర్తుకు వ‌స్తాయి. అప్ప‌టి త‌రం వారు ఎంత నీతిగా బ‌తికే వారు. మ‌నిషికి, మ‌నిషికి ఎంతో విలువ‌ను ఇచ్చేవారు. ఆప్యాయంగా ఉండేవారు. విలువ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్ప‌టి త‌రం వారు అలా ఎందుకు లేరు..? అని న‌న్ను నేను ప్ర‌శ్నించుకుంటా. నాకు మాత్రం స‌మాజంలో జ‌రిగే ప్ర‌తి విషయం ప‌ర్స‌న‌లే. ప్ర‌తి రోజూ ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటా. ఒక కొత్త మైలురాయిని సాధించిన‌ప్ప‌డ‌ల్లా ఎవ‌రెస్ట్ ఎక్కినంత ఆనందం క‌లుగుతుంది. యువతిగా ఉన్న‌ప్పుడు, పెళ్లి చేసుకుని ఉమ్మ‌డి కుటుంబంలోకి వ‌చ్చిన‌ప్పుడు, ఉద్యోగిగా ప‌నిచేసేట‌ప్పుడు… వ్య‌క్తిగ‌త జీవితంలో, ప‌నిలో, సమాజంలో ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్నా. నిపుణులు, నాయ‌కులు, గొప్ప వారి నుంచి స‌ల‌హాలు పొందా. అంద‌రూ అలాగే ఉండాలి. కానీ ఇప్ప‌టి త‌రం వారు అలా కాదు. అంతా సోలోగానే ముందుకు వెళ్తున్నారు.


Comments