హీరోయిన్ “అలియా భట్” సినిమాల్లోకి రాకముందు ఎంత లావుగా ఉండేదో తెలుసా.?
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత, రచయిత మహేష్ భట్ తెలుసు కదా. ఆయన గారాల పట్టి ఆలియా భట్ గురించి తెలియని వారుండరు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆలియా భట్ మాత్రం నటిగా బాగా గుర్తింపు పొందింది. అనేక సినిమాల్లో తనదైన శైలిలో నటించి నటనలో మంచి మార్కులనే కొట్టేసింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఆలియా భట్ వేరే తెలుసా..? అంటే.. ఇప్పుడు బాగా సన్నగా ఆలియా ఉంది. కానీ ఒకప్పుడు ఆమె బొద్దు గుమ్మ అని మీకు తెలుసా..? అవును, మీరు విన్నది నిజమే.ఆలియా భట్ ఇప్పుడు స్లిమ్‌గా ఉంది కానీ, ఒకప్పుడు చాలా లావుగా ఉండేది. అయితే ఆమె మొదటి సినిమా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. అందుకు గాను ఆమె సెలెక్ట్ అయింది. కానీ లావుగా ఉండడంతో బరువు తగ్గాలని సూచించారు. దీంతో ఆమె చాలా డైటింగ్ చేసి అప్పట్లో ఏకంగా 16 కిలోల వరకు బరువు తగ్గింది. అందుకు ఆమె ఎంతగానో శ్రమించింది. అయితే ఇప్పుడు ఆలియా భట్ జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఓ వీడియో వైరల్ గా మారింది. అంతేకాదు, ఒకప్పుడు ఆలియా 16 కిలోల వరకు బరువు తగ్గందని ఆ వీడియో ద్వారా ప్రచారం చేస్తున్నారు.
Comments
Post a Comment