ఒకప్పుడది దెయ్యాల కొంప..ఇప్పుడు టూరిస్ట్ స్పాట్
అదో ఖాళీ ఫ్లాట్. కొంతకాలంగా అందులో ఎవరూ నివసించట్లేదు. ఇందులో దిగిన వారెవరికీ అచ్చి రాకపోవడంతో.. ఎవరూ కూడా ఎక్కువ రోజులు అందులో నివసించలేదు.దీనితో దానికి ఘోస్ట్ ఫ్లాట్‌గా పేరు పడిపోయింది. కొంతకాలంగా ఆ ఫ్లాట్‌ను ఎవరూ పట్టించుకోవట్లేదు. అలాంటిది రాత్రికి రాత్రి ఓ టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది.కారణం.. ఈ వాటర్ ఫాల్స్. చైనాలోని లియానింగ్ ప్రావిన్స్ అన్షన్ ప్రాంతంలో ఉందా ఫ్లాట్. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దాని నిర్వహణ కూడా ఎవరూ పట్టించుకోలేదు.
దీనితో ఆ ఇంటికి ఉన్న వాటర్ పైప్‌లైన్ లీక్ అయింది. ధారగా నీరు కారడం మొదలు పెట్టింది. ఇలా కారుతూ చివరికి ఆ నీటి ధార ఓ వాటర్ ఫాల్‌లా ఏర్పడ్డాయి.
అంతే కాదు.. అవి అలాగే నిరంతరాయంగా కొన్ని రోజుల పాటు పడటంతో పై నుంచి కింది వరకు అలాగే గడ్డకట్టుకుపోయాయి. అలా 10 మీటర్ల పైనుంచి జారిపడిన నీళ్లు గడ్డకట్టుకుపోయాయి.ఇలా నీళ్లు గడ్డలు కట్టడంతో ఇప్పుడు అక్కడి స్థానికుల దృష్టి ఆ ఇంటిపై పడింది. ఇక.. గడ్డకట్టుకుపోయిన ఆ వాటర్ ఫాల్ ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అయిపోయిందట.
Comments
Post a Comment