“వీణా శ్రీవాణి” గురించి చాలామందికి తెలియని విషయాలు ఇవే..!

“వీణా శ్రీవాణి” గురించి చాలామందికి తెలియని విషయాలు ఇవే..!

.తన పేరు కు ముందు వీణను చేర్చుకుని ,వీణ మీద రకరకాల పాటలు వాయిస్తూ అందరి దృష్టి తనవైపుకు తిప్పుకుంటుంది..వీణ మీద శ్రీవాణి వాయించిన నువ్ పెద్దపులి సాంగ్ అయితే ఇప్పటికి,ఎప్పటికి అధ్భుతమే..అలాంటి వీణా శ్రీవాణి గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

తూర్పు గోదావరి జిల్లా నందుంపూడిలో శ్రీవాణి జన్మించారు..చిన్నతనం నుండే సంగీతం పట్ల ఆసక్తి కనపరిచే శ్రీవాణి..తన ఏడవఏట నుండే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు..
మూడవ తరగతిలో ఉండగా తూర్పుగోదావరి జిల్లా బండారులంకలో పిచ్చుక సీతామహాలక్ష్మి గారి దగ్గర వీణాభ్యాసానికి ఓనమాలు నేర్చుకుంది.
సీతామహాలక్ష్మి గారి ప్రోత్సాహంతో ఐదవ తరగతి నుంచే స్టేజీల మీద ప్రదర్శనలివ్వడం మొదలుపెట్టింది శ్రీవాణి. అలా ఒకవైపు చదువు, మరోవైపు వీణా వాయిద్య ప్రదర్శన ఇచ్చేది.
తొమ్మిదో తరగతిలో అయ్యగారి సత్యప్రసాద్ గారి దగ్గర సర్టిఫికేట్ కోర్సు చేసింది. ఆ బ్యాచ్‌లో శ్రీవాణే టాపర్.
ఆ తర్వాత వడలి ఫణి నారాయణ గారి దగ్గర సంగీతంలో డిప్లొమా చేసింది.
ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినప్పటికీ .. వీణకు దూరమవ్వాల్సి వస్తుందని ఉద్యోగాన్నే వదులుకుంది.
డిగ్రీలో ఉండగా శ్రీవాణికి పెళ్లి నిశ్చయమైంది..ఆ తర్వాత వీణ సాధన అటకెక్కింది..
పెళ్లి తర్వాత ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా.. ఎనిమిది సంవత్సరాలకు పైగా ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్‌లో యాంకర్‌గా రాణించింది శ్రీవాణి.
మామూలుగా అయితే వీణ స్పీడ్ నిమిషానికి 120 ఉంటుంది. ఇదే చాలా కష్టం. కానీ శ్రీవాణి 130 స్పీడ్‌తో వీణ వాయించగలదు.
ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ భర్త సలహాతో వీణ పట్టింది శ్రీవాణి..వేణుస్వామి శ్రీవాణి భర్త..వీణ మీద వాయించిన పాటలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది..
వీణ అంటే కీర్తనలు, కృతులు మాత్రమే పలికిస్తారు. కానీ ఈ తరానికి కనెక్ట్ అయ్యేలా ఇప్పటి పాటలు లిరిక్స్‌తో సహా వీణపాటలా మార్చడంతో ఈ వీడియోలకు తెగ వ్యూవ్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రముఖ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర సినిమాలకు వీణ వాయిస్తున్నది.
అజ్ణాతవాసి ఆడియో లాంచ్ ఫంక్షన్ లో వీణా శ్రీవాణి అదరగొట్టిన ఫెర్మార్మెన్స్ తో ఒకసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది..
\



Comments