దినకరన్, క్రిష్ణప్రియ, అమ్మ మేనేజర్ కు సమన్లు


దినకరన్, క్రిష్ణప్రియ, అమ్మ మేనేజర్ కు సమన్లు 



తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేస్తున్న ఆర్ముగస్వామి ఏకసభ్య విచారణ కమిషన్ టీటీవీ దినకరన్ తో పాటు మరి కొందరికి సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. వారంలోపు విచారణకు హాజరు కావాలని టీటీవీ దినకరన్ కు ఆదేశాలు జారీ చేశారు.ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయిన టీటీవీ దినకరన్, శశికళ సోదరురుడు జయరామన్ కుమార్తె, జయా టీవీ సీఇవో వివేక్ సోదరి క్రిష్ణప్రియ, జయలలిత బ్రతికి ఉన్నంత వరకూ పోయెస్ గార్డెన్ లో ఆమె మేనేజర్ గా పని చేసిన పొన్ గుండ్రన్ కు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ సమన్లు జారీ చేసింది.వారం రోజుల్లోపు విచారణకు హాజరుకావాలని టీటీవీ దినకరన్ కు సూచించారు. జనవరి 2వ తేదీ విచారణకు రావాలని శశికళ మేనకోడలు క్రిష్ణప్రియకు సూచించారు. మీదగ్గర ఉన్న పక్కా ఆధారాలతో విచారణకు హాజరుకావాలని క్రిష్ణప్రియకు సూచించారు.జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మీరు అక్కడ ఏం చేశారు ? ఏం చూశారు ? అనే పూర్తి సమాచారం ఇవ్వాలని ఆర్ముగస్వామి విచారణ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో విడుదల చేసిన టీటీవీ దినకరన్ అనుచరుడు వెట్రివేల్ కు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.జయలలిత ప్రాణాలతో ఉన్న సమయంలో, ఆసపత్రిలో చేరక ముందు ఆమెను ఎవరెవరు కలిశారు, ఏ కార్యక్రమాలకు ఆమె హాజరైనారు అనే పూర్తి సమాచారం రికార్డులతో సహ తీసుకురావాలని పోయెస్ గార్డెన్ లో అమ్మ మేనేజర్ గా పని చేసిన పొన్ గుండ్రన్ కు సూచించారు.ఇప్పటికే సమన్లు అందుకున్న టీటీవీ దినకరన్ వర్గం నాయకుడు వెట్రివేల్ జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీసిన వీడియో క్లిప్పింగ్ ను ఆయన న్యాయవాది సహాయంతో ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు అందించారు.





Comments