అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ గురించి ఏమన్నారంటే..!

అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ గురించి ఏమన్నారంటే..!

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో ఉంటారు. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే కేటీఆర్ తాజాగా తన అభిమానులతో లైవ్ చాట్ నిర్వహించారు. ఆ లైవ్ చాట్ లో పలువురు అడిగిన ప్రశ్నలకు ఆయన ఎంతో ఓపికగా సమాధానం చెప్పారు. హైదరాబాద్, తెలంగాణల గురించి మాత్రమే కాకుండా పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, సమంత ల గురించి ఆయన మాట్లాడారు.ఎన్టీఆర్‌ని ‘పెర్ఫార్మర్’ అని, మహేష్‌బాబును ‘స్క్రీన్ ప్రెజెన్స్‌లో సూపర్ స్టార్’ అని, ప్రభాస్‌ను ‘బాహుబలి’ అని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ గురించి చెబుతూ ఆయనను ‘ఎనిగ్మా’ అని పేర్కొన్నారు. ఎనిగ్మా అంటే ఎవరికీ అర్థంకాని వ్యక్తి అని తెలిపారు. పవన్ రాజకీయ భవితవ్యం గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అది ప్రజలు నిర్ణయిస్తారని, అది చెప్పడానికి తానెవరినని ఎదురు ప్రశ్నించారు. సమంత గురించి చెబుతూ తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత అని, చాలా సున్నిత మనస్కురాలని కేటీఆర్ పేర్కొన్నారు.








Comments