టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుంది
టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుందని
సిపియం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు అన్నారు. మంద క్రిష్ణ
మాదిగ అరెస్టును నిరసిస్తూ సిపియం అధ్వర్యంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి బైక్ ర్యాలీ
చేపట్టారు. రాజ్యాంగ ప్రకారం ప్రతి పౌరుడు, సంస్థలు, అసోసియేషన్లు
తమ సమస్యలమీద ఉద్యమించే హక్కుందన్నారు. సమస్యలను పరిష్కరించకుండా
టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమ అరెస్ట్లులకు పాల్పడుతూ ఉద్యమాన్ని అనిచి వేస్తుందని వారు
ఆరోపించారు.
Comments
Post a Comment