ఐశ్వర్యరాయ్ కుటుంబంలో చిచ్చు, ఏం జరిగింది?

ఐశ్వర్యరాయ్ కుటుంబంలో చిచ్చు, ఏం జరిగింది?


అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ఇటీవల ముంబైలో గ్రాండ్‌గా తమ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వేడకకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. బచ్చన్ ఫ్యామిలీ నుండి అమితాబ్ బచ్చన్, శ్వేతా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఐశ్వర్యరాయ్, శ్వేతా బచ్చన్ ప్రవర్తన కాస్త తేడాగా ఉండటమే ఇందుకు కారణం.

విరాట్ కోహ్లి-అనుష్క శర్మ వెడ్డింగ్ రిసెప్షన్‌కు తన భర్త అభిషేక్‌తో కలిసి ఐశ్వర్యరాయ్...... తండ్రి అమితాబ్‌తో కలిసి శ్వేతా హాజరయ్యారు. భుజం గాయంతో ఉన్న తండ్రిని తన చేయి పట్టుకుని తీసుకొచ్చింది శ్వేత.

వెడ్డింగ్ రిసెప్షన్లో ఐశ్వర్యరాయ్, శ్వేతా ప్రర్తించిన తీరు ప్రతి ఒక్కరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తోంది. వీరు ఇక్కడ కుటుంబ సభ్యుల్లా ప్రవర్తించలేదని, అంటీ ముట్టన్లు... ఎడమొహం, పెడమొహంగా ఉన్నారని చర్చించుకుంటున్నారు.

ఐశ్వర్యరాయ్, శ్వేతా బచ్చన్ ప్రవర్తనకు సంబంధించి వీడియో సాక్ష్యం ఉండటంతో.... బచ్చన్ కుటుంబంలో ఏదో ఒక విషయంలో చిచ్చు రేగిందని, అంతర్గతంగా ఏవో గొడవల జరిగి ఉంటాయనే వాదన తెరపైకి వచ్చింది.

నలుగురూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వాలని మీడియా వారు కోరగా.... భర్త బలవంతం మీద ఐశ్వర్యరాయ్, తండ్రి బలవంతం మీద శ్వేత ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. సమస్య ఆ ఇద్దరి మధ్యే అయి ఉంటుందని భావిస్తున్నారు.

ఏం గొడవ జరిగిందో తెలియదు కానీ.... ఇటు భార్యకు సర్దిచెప్పుకోలేక అభిషేక్ బచ్చన్, కూతురుని ఏమీ అనలేక అమితాబ్ లోలోన సతమతం అయినట్లు వారి ముఖకవలికలు చూస్తే స్పష్టం అవుతోందని అంటున్నారు.







Comments