దెబ్బ మీద దెబ్బ తింటున్న `సైరా` ... నయనతార కూడా ఔటా?
కొబ్బరికాయ కొట్టిన వేళా విశేషమేంటో గానీ కొణిదెల ప్రొడక్షన్స్ వారికి `సైరా` కలిసి రావట్లేదు. సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఏఆర్ రెహ్మాన్ తప్పుకొన్నారు. ఆ తరువాత సినిమాటోగ్రాఫర్.ఇప్పుడు అదే జాబితాలో హీరోయిన్ నయనతార కూడా చేరినట్టేనని ఫిల్మ్‌నగర్ చెబుతోంది. నయనతార కూడా ఈ మూవీ నుంచి తప్పుకొందనే పుకారు ఫిల్మ్‌నగర్‌లో షికారు కొడుతోంది.ఈ సినిమా కోసం ఇదివరకే నయనతార డేట్స్, కాల్‌షీట్స్ ఇచ్చారు. సినిమా సెట్స్‌పైకి వెళ్లడంలో నెలకొన్న జాప్యం వల్ల నయన్ ఇచ్చిన డేట్స్, కాల్‌షీట్స్ అన్ని కొరగాకుండా పోయాయట.
Comments
Post a Comment