ఆ గ్రామంలో అమ్మాయి పుడితే …ఆ అమ్మాయి అదృష్టవంతురాలు ..ఎందుకో,ఎక్కడో తెలుసా ?
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
ఆ గ్రామంలో అమ్మాయి పుడితే …ఆ అమ్మాయి అదృష్టవంతురాలు ..ఎందుకో,ఎక్కడో తెలుసా ?
రాజస్థాన్ లోని రాజ్సమన్డ్ జిల్లాలోని ప్లిపాంట్రి అనే గ్రామం 2006 నుండి ఓ వింత ఆచారాన్ని పాటిస్తూ….ప్రపంచ దేశాలన్నింటికీ ఓ మంచి మెసేజ్ ను ఇస్తుంది.! ఆ ఊర్లో అమ్మాయి పుట్టిందని తెలిస్తే చాలు …ఊరంతా కలిసి ఆ అమ్మాయి పేరు మీద 111 చెట్లు నాటుతారు. ఇందులో వేప,ఉసిరి, మామిడి తో పాటు కలబంద చెట్లు కూడా ఉంటాయి. ఆ అమ్మాయి ఎదిగినా కొద్దీ ఈ చెట్ల నుండి వచ్చే ప్రతి పైసా ఆ అమ్మాయికే దక్కేలా ముందుగానే వీలునామా రాసిపెడతారు.దీనికి తోడు.. అమ్మాయి పుడితే ఊరంతా కలిసి 21000 రూపాయలు జమచేసి, ఆ అమ్మాయి తల్లిదండ్రుల నుండి 10,000 రూపాయలు వసూలు చేసి…మొత్తం 31000 రూపాయలు ఆ అమ్మాయి పేరు మీద బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు.! ఆ అమ్మాయి పెళ్ళికి మాత్రమే డ్రా చేసే విధంగా అఫిడవిట్ రాస్తారు. మరో విషయం ఏంటంటే…. ఆ అమ్మాయి ఇష్టప్రకారమే ఆమె పెళ్లిని నిర్ణయిస్తారు.ఈ నియమాన్ని ఈ గ్రామంలో ప్రవేశపెట్టింది…శ్యామ్ సుందర్ పలివాల్….వయస్సుకొచ్చిన తన కూతురు చనిపోవడంతో కలత చెందిన పలివాల్ ఈ నియమాన్ని తీసుకొచ్చారు. ఆ గ్రామస్తులంతా ఈ నియమాన్ని గౌరవిస్తూ…ఆడపిల్లలు పుట్టడాన్ని అదృష్టంగా భావిస్తున్నారు.!
Comments
Post a Comment