దుమారం రేపుతున్న "వాణీ'స్ ఎన్టీఆర్" : ఎన్టీఆర్ సతీమణిగా నటించడానికి నేను సిద్ధం
ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ల "సిరీస్" హవా నడుస్తోంది. ఒక పక్క బాలయ్య తేజా కాంబినేషన్ లో ఒక బయోపిక్ వస్తుందన్న విష్యమూ, అదే సమయం లో రామ్ గోపాల్ వర్మ దానికి పోటీగా లక్ష్మీ'స్ ఎన్టీఆర్ మొదలు పెట్టిన సంగతీ తెలిసిందే. అయితే అప్పటి వరకూ సినిమా అంశంగానే ఉన్న ఈ బయోపిక్ ఎప్పుడైతే వర్మ కి మద్దతుగా వయ్యెస్సార్ పార్టీ ఉందన్న విషయం బయటికి వచ్చిందో అప్పుడే రాజకీయ రంగు పులుముకుంది. వర్మ తీసే సినిమా తెలుగుదేశం పార్టీ కి వ్యతిరేకమైన అంశాలతో ఉంటుందన్న అభిప్రాయం ఏర్పడగానే పాపం లక్ష్మీ పార్వతిని కూడా సీన్ లోకి తెచ్చేసినట్టయ్యింది. ఆ వెంటనేకేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి 'లక్ష్మీస్ వీరగ్రంథం' పేరుతో సినిమా అంటూ ప్రకటించాడు. అయితే ఈ సినిమాపై లక్ష్మీ పార్వతి అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడివరకూ ఉన్నది ఒక ఎత్తైతే ఇప్పుడు ఒకనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్ కూడా ఈ వివాదం లోకి అడుగు పెట్టటంతో మరింత ఇంట్రస్టింగ్ వ్యవహారంగా తయారయ్యింది "లక్ష్మీస్ వీరగ్రంథం" చిత్రంలో నటించనమని తనకు ఆఫర్ వచ్చిన మాట నిజమేనని, అన్నీ కుదిరితే ఎన్టీఆర్ సతీమణిగా నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పిన నటి వాణీ విశ్వనాథ్ ఈ కాంట్రవర్సీని మరింత ఆసక్తికరం చేసారు.
Comments
Post a Comment