వెండితెరపై మరో దుమారమే: దుమ్ము రేపుతోన్న రాహుల్ రామకృష్ణ పాట


 వెండితెరపై మరో దుమారమే: దుమ్ము రేపుతోన్న రాహుల్ రామకృష్ణ పాట

తెరపై మూస, రొటీన్ కథాంశాలతో విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులను అర్జున్ రెడ్డి అనే తుఫాన్ ఈ ఏడాది ఎంతలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా విడుదలైన ఓ పాటను చూస్తుంటే.. 2018లో వెండితెరపై మరో దుమారం రాబోతుందా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాలో శివ పాత్రలో ఇరగదీసిన రాహుల్ రామకృష్ణ.. 'సోషల్ మీడియా దుమారమే' అంటూ పాడిన పాట ఇప్పుడు నిజంగానే సోషల్ మీడియాలో దుమారం లేపుతోంది..
జ్యోతిలక్ష్మి' ఫేమ్‌ సత్యదేవ్‌ కథానాయకుడిగా ఆకార్‌ మూవీస్‌ పతాకంపై దాము కొసనం, జీవనరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'గువ్వ గోరింక'. ఫస్ట్ లుక్, టీజర్ తోనే ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిత్రం.. ఇప్పుడో హుషారైన పాటతో హోరెత్తిస్తోంది.
పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ ప్రియదర్శి, అర్జున్ రెడ్డితో గుర్తుండిపోయే పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ.. ఈ ఇద్దరూ సినిమాలో ఉండటంతో తెరపై నవ్వుల బ్లాస్టింగ్ ఖాయమే అనిపిస్తోంది. ప్రస్తుతం గువ్వ గోరింక చిత్రం షూటింగ్ దశలో ఉంది.





Comments