బాబా రామ్‌దేవ్‌పైనా ఓ బయోపిక్.
యోగా గురు, పతంజలి గ్రూప్ సంస్థల అధినేత బాబా రామ్‌దేవ్‌పైనా ఓ బయోపిక్ రెడీ అవుతోంది. ఇది సినిమాగా మాత్రం కాదు. టీవీ సీరియల్‌గా దీన్ని చిత్రీకరిస్తున్నారు.ఈ సినిమాకు నిర్మాత మరెవరో కాదు.. బాలీవుడ్ టాప్ యాక్టర్ అజయ్ దేవ్‌గణ్. ‘డిస్కవరి జీత్’ ఛానల్‌లో సీరియల్‌గా ఈ బయోపిక్ ప్రసారం కానుంది. ‘స్వామి రాందేవ్: ఏక్ సంఘర్ష్’ అనే పేరుతో దీన్ని నిర్మిస్తున్నారు.ఎంఎస్ ధోని, గోలియోంకా రాస్‌లీలా రామ్–లీలా చిత్రాల్లో నటించిన క్రాంతి ప్రకాష్ ఝా ఈ చిత్రంలో బాబా రామ్‌దేవ్‌గా నటిస్తున్నారు.బాల నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న నమన్ జైన్ ఈ బయోపిక్‌లో చిన్నప్పటి రామ్‌దేవ్‌గా నటిస్తారట. జనవరి నుంచి ఈ సీరియల్ ప్రసారం అవుతుందని అజయ్ దేవ్‌గణ్ వెల్లడించారు.
Comments
Post a Comment