రాజస్థాన్‌లో వున్న అమేర్ మహల్ కోటలో ఏముందో తెలుసా ?
పరగ్గా చూస్తే
మన అరుంధతి జేజమ్మ బంగ్లాలా కనిపించే ఈ కోట ఇక్కడిది కాదు. రాజస్థాన్‌లోనిది.
భీమవరంలో అందరూ రాజులే ఉంటారన్నట్టు.. రాజస్థాన్‌లో అన్నీ కోటలే ఉంటాయి
గానీ.. వాటన్నింట్లోకి కంప్లీట్ డిఫరెంట్ ఇది.దీనికున్న డిమాండే వేరు. దీని పేరు అమేర్ మహల్. జైపూర్ శివార్లలోని అమేర్ ప్రాంతంలో ఉంటుంది. రాజస్థాన్‌కు వెళ్లి కోటలను చుట్టేసి రావాలనుకునే ప్రతి ఒక్కరూ మొదటగా చూసేది దీన్నే.రాజస్థాన్‌లో ఉండే అన్ని కోటలతో పోల్చుకుంటే దీని లుక్కే వేరు. అందుకే- శని, ఆది, సోమ..ఈ మూడురోజుల్లో ఈ కోటను సందర్శించిన వారి సంఖ్య లక్షన్నరకు పైమాటేనట.రోజూ అరలక్ష మందికి తగ్గకుండా సందర్శకులు వచ్చారని రాజస్థాన్ పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మూడురోజుల్లో టికట్లను విక్రయించడం ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించారు అధికారులు.
Comments
Post a Comment