పద్మావతి సినిమా విడుదల కాబోతోంది.. కానీ ఇవి పాటిస్తేనే..!
ఈ ఏడాది వివాదాల్లో నిలిచిన ముఖ్యమైన సినిమా పద్మావతి అని చెప్పుకోవాలి. దీపిక పదుకోన్ ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే సినిమాలో ఎన్నో వివాదాస్పద అంశాలు ఉన్నాయని పలువురు అడ్డుతగలడంతో విడుదలను ఆపేశారు. తాజాగా ఈ సినిమాను సెన్సార్ బృందానికి చూపించారు. సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చేందుకు కొన్ని మార్పులు, చేర్పులు చేయాలంటూ నిర్మాత, దర్శకుడికి కేంద్ర సెన్సార్ బోర్డు సూచించింది. ‘పద్మావతి’ అనే పేరును ‘పద్మావత్’ గా మార్చాలని తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం సినిమాలో 26 సన్నివేశాలను కట్ చేస్తామని చెప్పింది.భారతదేశంలోని ఏ రాష్ట్ర చరిత్రతో ఈ సినిమా కథకు సంబంధం లేదని ప్రకటించాలని సూచించింది. తమ సూచనలను అమలు చేస్తే ‘పద్మావతికి’ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అన్నీ పూర్తీ అయితే ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాజపుత్ర వనిత రాణి పద్మావతి చరిత్రను వక్రీకరించారని.. రాజ్ పుత్ లు అభ్యంతరాలు మొదలుపెట్టడంతో వివాదం మొదలైంది.
Comments
Post a Comment