పాక్ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ మన హీరోయిన్ ను కిడ్నాప్ చేయాలనుకున్నాడట.. ఎవరంటే..!

పాక్ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ మన హీరోయిన్ ను కిడ్నాప్ చేయాలనుకున్నాడట.. ఎవరంటే..!


షోయబ్ అఖ్తర్.. ఈ పాకిస్థానీ ఫాస్ట్ బౌలర్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. షోయబ్ బౌలింగ్ అంటే చాలు జడుసుకునే బ్యాట్స్మెన్ చాలామంది ఉండేవారు. షోయబ్ కు భారత్ అన్నా.. బాలీవుడ్ సినిమాలు అన్నా ఎంతో ఇష్టం ఉండేది. అయితే ఓ హీరోయిన్ అంటే మాత్రం షోయబ్ కు ఎక్కడ లేని అభిమానం.. ఆమెను కలుసుకోవాలని.. తనకు ఆమె మీద ఉన్న ప్రేమ గురించి తెలియజేయాలని తపిస్తూ ఉండేవాడట. చివరికి ఆమె తన ప్రేమను ఒప్పుకోకపోతే కిడ్నాప్ కూడా చేయాలని అనుకున్నాడట.. ఇంతకూ ఎవరామె అని అనుకుంటున్నారా.. ఆమెనే ‘సోనాలీ బింద్రే’.బాలీవుడ్ నటి సోనాలీ బింద్రే అంటే షోయబ్ కు చాలా ఇష్టం అట. ఎంత ఇష్టం అంటే తన పర్సులో సోనాలీ ఫొటో ఎప్పుడూ ఉండేదట. ఆమెను ఓ సారి కలిసి, తన ప్రేమను వెల్లడిద్దామని అనుకున్నాడట. అంతేకాదు, ఒకవేళ తన ప్రేమను ఆమె తిరస్కరిస్తే కిడ్నాప్ చేయాలని కూడా అనుకున్నాడట(తమాషాకి).కానీ.. ఇంత వరకు ఆమెను ఒక్కసారి కూడా కలవలేకపోయానని చెప్పుకొచ్చాడు షోయబ్. సోనాలీ బింద్రే అప్పట్లో హీరోయిన్ గా ఓ వెలుగువెలిగింది. ఆమె తెలుగులో కూడా ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబిఎస్, పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి సినిమాలలో నటించింది. సోనాలీ బింద్రే అంటే సినీ అభిమానులే కాకుండా పలువురు ప్రముఖులు కూడా పడిచచ్చేవారు. 2002లో సోనాలీ గోల్డీ బెల్ ను పెళ్ళి చేసుకుంది.








Comments