డైరెక్టర్ తనపై కన్నేసాడని సాక్ష్యం చూపిన హీరోయిన్!
కాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం అయిపోయింది. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న నటీమణులను హీరోలు, దర్శకుడు, నిర్మాతలు లొంగదీసుకోవడం లాంటి సంఘటనలు జరిగినట్లు తరచూ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటిపై అవేర్‌నెస్ పెరగడంతో కొందరు హీరోయిన్లు ఎలాంటి భయం లేకుండా ఈ విషయాలను బయట పెడుతున్నారు. అయితే చాలా మంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ లాంటి సంఘటనలు ఎదురైనప్పటికీ బయటకు చెప్పడం లేదు.
కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు, టీవీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని తాజా సంఘటన ఒకటి స్పష్టం చేస్తోంది. తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనను టీవీ నటి సాక్ష్యాలతో సహా బయట పెట్టింది.టీవీ నటి సులగ్నా చటర్జీ తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనను సాక్ష్యాలతో సహా బయట పెట్టింది. అందుకు సంబంధించి వాట్సాఫ్ స్క్రీన్ షాట్లను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ డైరెక్టర్ తనను కాంప్రమైజ్(లైంగికంగా)కావాలని ఓ మధ్యవర్తి ద్వారా చేసిన ప్రయత్నాలను ఆమె బయట పెట్టింది.
అవకాశం ఇస్తానని, ఫుల్ పేమెంట్ అయిన తర్వాతే కాంప్రమైజ్ అవ్వొచ్చు.... అంటూ మిడిల్ ఏజెంట్ ద్వారా సదరు డైరెక్టర్ బేరసారాలు జరుపగా ఆమె దాన్ని తిరస్కరించింది. కాంప్రమైజ్ కావడం వల్ల వచ్చే అవకాశాలు తనకు వద్దని ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చారు.
అయితే ఈ సంఘటన ఎదురైన విషయం బయట పెట్టిందే తప్ప.... దీని వెనక ఉన్న ఆ డైరెక్టర్ ఎవరు? తనతో సంప్రదింపులు జరిపిన ఏజెంట్ ఎవరు? అనే విషయాలు మాత్రం సులగ్నా బయటపెట్టకపోవడం గమనార్హం.
Comments
Post a Comment