ప్రతీ పేదవాడికీ ఇల్లు : జగన్‌ను సీఎం చేయాలి. రోజా

ప్రతీ పేదవాడికీ ఇల్లు : జగన్‌ను సీఎం చేయాలి.  రోజా 


చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి నాలుగేళ్లయినా ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టించలేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అందరికీ ఇల్లు కట్టిస్తామని జగన్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆ ఇంటిని వారిపేరున రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామని చెప్పారు. అవసరమైతే ఇంటిని తాకట్టు పెట్టి అప్పుతీసుకునే అవకాశం కల్పిస్తామని, ఆ రుణాలు కూడా పావలా వడ్డీకే ఇస్తామని చెప్పారు.చంద్రబాబు ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని, ఆయన మహిళలకు రక్షణ లేదని అన్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న విజయవాడలోనే మహిళలపై అరాచకాలు ఎక్కువవుతున్నాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. రావణాసురుడు, నరకాసురుడు పాలిస్తే ఎలా ఉంటోందో చంద్రబాబు పాలన కూడా అలాగే ఉందని విమర్శించారు.


Comments