అంతా రహస్యం...రెండేళ్ల తర్వాత బాంబుపేల్చిన హీరోయిన్, అతడితో పెళ్లయిపోయింది!
ఈ మధ్య కాలంలో కొందరు సినిమా స్టార్లు పెళ్లి వేడుక ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరుపుకుంటున్నారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా విషయం బయట పెడుతున్నారు. ఇటీవల అనుష్క-విరాట్ కోహ్లి వివాహం కూడా అలానే జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి జరిగిన మర్నాడో, లేక కొన్ని రోజుల తర్వాతో విషయం అందరికీ చెప్పడం మామూలే. తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ రెండేళ్ల క్రితం రహస్య వివాహం చేసుకుని ఇపుడు విషయం బయట పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.బాలీవుడ్ మూవీ ‘హేట్ స్టోరీ 2' సినిమాలో బోల్డ్‌గా నటించి వార్తల్లోకి ఎక్కడిన సుర్వీన్ చావ్లా తన భర్త ఇతడే అంటూ సోషల్ మీడియాలో అక్షయ్ ఠాకూర్ అనే బిజినెస్ మేన్ ఫోటోను పోస్టు చేయడం చర్చనీయాంశం అయింది.బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం రెండేళ్ల క్రితమే అంటే... జులై 28, 2015లోనే వీరి వివాహం ఉత్తర ఇటలీలో జరిగిందని తెలుస్తోంది. అయితే రెండేళ్ల పాటు వీరు తమ వివాహ విషయాన్ని ఇంత రహస్యంగా ఎలా ఉంచారనేది ఎవరికీ అర్థం కావడం లేదు.సర్వీన్ చావ్లా, అక్షయ్ ఠాకూర్ 2013లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2015లో వీరు వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.తమ పెళ్లి విషయాన్ని 2018లొ అనౌన్స్ చేయాలని సుర్వీన్ చావ్లా, అక్షయ్ ఠాకూర్ ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. న్యూఇయర్ ప్రారంభం కాగానే వీరు తమ పెళ్లి విషయం ప్రకటించి గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నారు.రెండు మూడు రోజుల్లో తమ వెడ్డింగ్ అనౌన్స్ మెంట్ జరుగనున్న నేపథ్యంలో మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ అయ్యేందుకే సుర్వీన్ చావ్లా ఒక ప్లాన్ ప్రకారం సోషల్ మీడియా ద్వారా తనకు పెళ్లి జరిగిన విషయాన్ని వెల్లడిస్తూ పోస్టు చేశారు.సుర్వీన్ చావ్లా తెలుగులో కూడా ఓ చిత్రం చేసింది. 2009లో వచ్చిన ‘రాజు మహారాజు' అనే సినిమా చేసింది. ఈచిత్రంలో మోహన్ బాబు, శర్వానంద్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
Comments
Post a Comment