`ఇన్ ద నేమ్ ఆఫ్ డాగ్..` అంటూ పొరపాటున ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి
జమ్మూకాశ్మీర్ మంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన తస్సాదుక్ ముఫ్తీ తడబడ్డారు. ప్రమాణ స్వీకార సమయంలో `ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్..` ఉచ్ఛరించాల్సి ఉండగా పొరపాటున `ఇన్ ద నేమ్ ఆఫ్ డాగ్` అంటూ పలికారు. వెంటనే సవరించుకున్నారు. `గాడ్..` అని పలికారు.దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తస్సాదుక్ ముఫ్తీ మరెవరో కాదు.. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి స్వయానా సోదరుడు. గతంలో వారం కిందట ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు.
Comments
Post a Comment