మహిళల నైపుణ్యానికి విశాఖలో ప్రారంభమైన డ్వాక్రా బజార్

మహిళల నైపుణ్యానికి విశాఖలో ప్రారంభమైన డ్వాక్రా బజార్..  డ్వాక్రా స్టాళ్లకు విశేష స్పందన


మహిళల నైపుణ్యానికి విశాఖలో ప్రారంభమైన డ్వాక్రా బజార్ అద్దం పడుతోంది. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రైండ్ లో ఏర్పాటు చేసిన బజార్ ను మంత్రి పరిటాల సునీత ప్రారంభించారుస్టాల్స్ ను తిలకించారు. మహిళల ఆర్దికాభివృద్దికి దొహదపడుతున్న ఉత్పత్తుల గురించి తెలుసుకున్నారు. తయారు చేస్తున్న వస్తువులకు గిరాకీ లేక డీలా పడుతున్న మహిళలకు డ్వాక్రా బజార్ లాంటివి ఉపయోగపడతాయని మంత్రి సునీత అన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా బజార్ లాంటి వేదికలను ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

40 స్టాళ్ల ఏర్పాటు….
డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులోనూ డ్వాక్రా బజారును ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసింది. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు ప్రధాన ప్రాంగణానికి పక్కన 20 టెంట్లు ఏర్పాటు చేశారు.  ఒక్కో టెంట్లో రెండు సంఘాలు తమ ఉత్పత్తులను విక్రయించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ స్టాళ్లలో చేనేత వస్ర్తాలు, తినుబండారాలు, పచ్చళ్లు, గిఫ్ట్, డిజైన్ ఆర్టికల్స్, గాజులు, రోల్డ్ గోల్డ్ అలంకార వస్తువులు, కొండపల్లి బొమ్మలు, కలపతో తయారు చేసిన దేవతా మూర్తుల విగ్రహాలు విక్రయిస్తున్నారు. ఆయుర్వేదిక్ ఔషధాలతో పాటు హెర్బల్  హెయిర్ ఆయిల్, షాంపూలను అమ్మకాలు సాగిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నంతో పాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన డ్వాక్రా సంఘాలు ఈ స్టాళ్లలో తమ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు.





Comments