సినిమా కోసం పుట్టబోయే బేబీ మరో నాలుగు రోజులు వెయిట్ చేస్తుందని ఆశిస్తున్నా : మంచు విష్ణు
రసవత్తరంగా సంక్రాంతి బాక్సాఫీసు.. విజేత ఎవరో ? సంక్రాంతి అనగానే కోడి
పందేలతో పాటు సినీ జాతర కూడా గుర్తొస్తుంది. మూకుమ్మడిగా సినిమాలన్నీ తెరపై దూకేది
ఈ సీజన్ లోనే. ఒక రకంగా ఏడాది ప్రారంభంలో తెలుగు సినిమాలకు ఇదే తొలి పరీక్ష.
కాబట్టి బరిలో నిలిచే పందెం కోళ్లలో విజయం దేనిది అన్న ఆసక్తి సహజం. ఎప్పటిలాగే..
వచ్చే సంక్రాంతికి కూడా సినిమాలన్ని కట్టగట్టుకుని రాబోతున్నాయి. వీటిల్లో కొన్ని
స్టార్ ఎట్రాక్షన్‌తో కూడుకున్నవి కాగా.. మరికొన్ని కథాబలన్ని నమ్ముకున్నవి.
మొత్తానికి ఇన్నేసి సినిమాలు ఒకేసారి వస్తుండటంతో పోటీ మాత్రం గట్టిగానే
ఉండబోతుంది..
సంక్రాంతి బరిలో: సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి,
నందమూరి హీరో
బాలకృష్ణ జై సింహ చిత్రాలు సందడి చేయబోతున్నాయి. జనవరి 10న అజ్ఞాతవాసి
విడుదలవుతుండగా.. బాలయ్య జై సింహా జనవరి 12న విడుదలవుతోంది. రెండు పెద్ద సినిమాలు రెండు రోజుల
వ్యవధిలోనే వస్తుండటంతో మిగతా సినిమాలు జనవరి 26ని గురిపెట్టాయి.జనవరి 25,
26: అనుష్క 'భాగమతి', రవితేజ 'టచ్ చేసి చూడు', దండుపాళ్యం-3, రాజారథం, అభిమన్యుడు, సందీప్ కిషన్ 'మనసుకు నచ్చింది' సినిమాలు జనవరి 25,
26తేదీల్లో విడుదల
కాబోతున్నాయి.
జనవరి 25,26తేదీల్లో ఇన్ని సినిమాలు విడుదలకు సిద్దమవగా.. ఇప్పుడు మంచు విష్ణు 'ఆచారి అమెరికా యాత్ర'
దానికి తోడైంది.
సినిమాల పరంగా ఇంత పోటీ ఉన్నప్పటికీ.. తమ కథలోని కంటెంట్ పట్ల చిత్ర యూనిట్
నమ్మకంగా ఉందట. అందుకే ఏదేమైనా సరే సంక్రాంతి సీజన్ లోనే రంగంలోకి దిగేందుకు
సిద్దమవుతున్నారట.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అనుష్క నటించిన భాగమతి, రవితేజ 'టచ్ చేసి చూడు'పై భారీ అంచనాలే ఉన్నాయి.
మహేష్ బాబు సోదరి మంజుల నిర్మిస్తున్న 'మనసుకు నచ్చింది'పై కూడా మంచి బజ్ క్రియేట్
అయింది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర, అనుష్కను రవితేజను తట్టుకోగలదా?
అన్న ప్రశ్నలు
వ్యక్తమవుతున్నాయి. కాగా, ఆచారి అమెరికా యాత్రలో విష్ణు సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఆచారి
అమెరికా యాత్ర సినిమా షూటింగ్‌లో ప్రస్తుతం మంచు విష్ణు బిజీగా ఉన్నాడు.సినిమాకు
సంబంధించిన ఓ కీలకమైన సాంగ్ ను నాలుగు రోజుల పాటు చిత్రీకరించనున్నారట. అయితే
ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న విష్ణు భార్య విరానికా డెలివరీ డేట్ కూడా ఈ నాలుగు
రోజుల్లోనే ఖరారైందట.షూటింగ్ పూర్తయ్యే సమయంలోనే విరానికా డెలివరీ డేట్ కూడా
దగ్గరపడటంతో విష్ణు టెన్షన్ పడుతున్నాడట. అయితే పుట్టబోయే బేబీ నాకోసం మరో నాలుగు
రోజులు వెయిట్ చేస్తుందని ఆశిస్తున్నా అంటూ చెబుతున్నాడు.
Comments
Post a Comment