సునీల్ కు హీరోయిన్ గా చేయమంటే ...హీరోయిన్లు ఏమని అన్నారో తెలుసా..?
సునీల్.. ఒకప్పుడు అతడి కామెడీ కోసమే సినిమాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చాలా సినిమాలను తన కామెడీతో అదనపు బలాన్ని చేకూర్చాడు. ఆ తర్వాత ఫుల్ ఫామ్ లో ఉన్న సమయంలో హీరోగా చేయడం మొదలుపెట్టాడు సునీల్. మొదట్లో కొన్ని సినిమాలు మంచి హిట్స్ సాధించినప్పటికీ.. ఇప్పుడు హిట్ అనేది చాలా దూరమైంది సునీల్ కు..! తాజాగా సునీల్ నటించిన ‘2 కంట్రీస్’ సినిమా ఈరోజు విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ చిత్ర దర్శకుడు ఎన్.శంకర్ సునీల్ సినిమాలో హీరోయిన్ గా చేయమని కొందరిని అడిగితే వేరే విధంగా ప్రవర్తించారని చెప్పుకొచ్చారు.ఎన్.శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా మనీషా రాజ్ కథానాయికగా పరిచయం అవుతోంది. ఈ పాత్ర కోసం ఇక్కడి కథానాయికలలో కొంతమందిని అడగడం జరిగిందని అన్నారు. కొంతమంది డేట్స్ ప్రాబ్లమ్ అన్నారు .. మరి కొంతమంది చేయడం ఇష్టం లేదని అన్నారు. నిజం చెప్పాలంటే, సునీల్ చిన్న హీరో .. ఆయనతో చేస్తే మార్కెట్ ఉండదు అనే రీజన్స్ చెప్పారు. అప్పుడు నాకు చాలా బాధనిపించింది ఆయన అన్నారు. అయితే కొత్త అమ్మాయి అయినా మనీషా రాజ్ చాలా బాగా నటించిందని ఆయన చెప్పుకొచ్చారు. జమున, శ్రీదేవి, సౌందర్య లాంటి హీరోయిన్లు చిన్న హీరోలతోనూ చేశారని.. అలాగే పెద్ద హీరోలతోను చేశారని చెప్పారు. ఇప్పుడున్న కొంతమంది హీరోయిన్లు పెద్ద హీరోతో చేశాక .. రెమ్యునరేషన్ తగ్గుతుందని కిందికి దిగరని అసలు విషయాన్ని ఆయన బయటపెట్టారు. వారు చెప్పిన కారణాలు విని తనకు చాలా బాధగా అనిపించిందని శంకర్ అన్నారు.
Comments
Post a Comment