అక్రమ సంబంధానికి కూతురు అడ్డుగా ఉందని గొంతు నులిమి చంపిన తల్లి!
అక్రమ సంబంధం ద్వారా పుట్టిన ఆడ శిశువును గొంతు నులిమి చంపిందో తల్లి. మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసింది. ఈ ఘటన బెంగళూరు శివార్లలోని అనేకల్ తాలూకాలో చోటు చేసుకుంది.రెండేళ్ల ఆ చిన్నారి పేరు అన్నపూర్ణ. ఆ కిరాతక తల్లి పేరు నివేదిత. అయిదేళ్ల కిందట తన సమీప బంధువు చంద్రశేఖర్‌ను ఆమె వివాహం చేసుకుంది. దంపతులు అనేకల్ తాలూకాలోని అవడదేనహళ్లిలో నివాసం ఉంటుననారు.ఏడాదిన్నర కిందట నివేదితకు తన అత్త కుమారుడు సతీష్‌తో అక్రమ సంబంధం ఏర్పడింది. చంద్రశేఖర్‌తో విడిపోయి, సతీష్‌తో సహజీవనం చేయాలని నివేదిక నిర్ణయించుకుంది.మంగళవారం అన్నపూర్ణకు జ్వరం సోకింది. దీనితో ఆమె ఆ పాపను ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రిలో పాపను వదిలేసి, సతీష్‌తో బైక్‌పై పరారైంది. తన భార్య, కుమార్తె కనిపించకపోవడంతో చంద్రశేఖర్ అన్ని చోట్లా వెదికాడు.చివరికి అనేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సెల్ టవర్ లొకేషన్, కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు నివేదిత, సతీష్‌లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. వారిని అరెస్టు చేశారు.పాపను తాను ఆసుపత్రిలో వదిలేశానని నివేదిత చెప్పడంతో.. చంద్రశేఖర్, పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అప్పటికే పాప మరణించింది.చనిపోయిన పాపను వైద్యం కోసం తీసుకొచ్చారని, హడావుడిగా ఆసుపత్రిలో చేర్చిందని, పాప చనిపోయిందని చెప్పడంతో మృతదేహాన్ని తీసుకుని తల్లి వెళ్లిపోయిందని అక్కడి సిబ్బంది చెప్పారు.దీనితో పోలీసులు మరోసారి నివేదితను ప్రశ్నించగా.. అన్నపూర్ణను తానే చంపానని వెల్లడించింది. ఆమె చెప్పిన ప్రాంతానికి వెళ్లి పోలీసులు పాప మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నివేదిత, సతీష్‌లపై కేసు నమోదు చేశారు.
Comments
Post a Comment