టాప్ హీరోయిన్‌ను అనరాని మాటలు అన్న మమ్మూటీ ఫ్యాన్స్..ఫలితం అనుభవిస్తున్నారు!
ఈ ఫొటోలో కనిపిస్తోన్నది ఓ టాప్ మలయాళ నటి పార్వతి. మలయాళ
సూపర్‌స్టార్ అభిమానులు కొందరు ఆమెను టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియా వేదికగా
బూతులు తిట్టారు. అనరాని మాటలు అన్నారు.దీనిపై
ఆగ్రహించి పార్వతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు
అభిమానులు కటకటాల వెనక్కి తోశారు. వారిని అరెస్టు చేసినందుకు ఆ సూపర్‌స్టార్
కూడా పోలీసులను ప్రశంసించారు. ఎందుకంటే- ఓ నటిని, పైగా మహిళను లక్ష్యంగా చేసుకుని
బూతులు తిట్టడం సరికాదని అన్నారు. ఆ మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి. ఆయన
నటించిన ఓ సినిమాలోని కొన్ని సన్నివేశాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని
పార్వతి బాహటంగానే విమర్శించారు. కేరళలో ఇటీవలే జరిగిన ఇంటర్నేషనల్
ఫిల్మ్ ఫెస్టివల్‌లో మాట్లాడిన పార్వతి మమ్ముటి నటించిన చిత్రంపై విమర్శలు
చేశారు. ఆయన నటించిన `కసబా` చిత్రంలో మహిళలను అవమానించే
సన్నివేశాలు చాలా ఉన్నాయని, ఆ సినిమా
చూసినందుకు తాను చాలా బాధపడ్డానని, అలాగే
ఆ సినిమా చూసే ప్రతి స్త్రీ బాధపడుతుందని అన్నారు. దీనితో మమ్మూటీ ఫ్యాన్స్
పేరిట పలువురు పార్వతీపై సోషల్ మీడియా వేదికగా దాడులు చేశారు. అసభ్యకర సందేశాలు
పంపించడమే కాకుండా ఆమె చంపేస్తామంటూ బెదిరించారు. వాటి తాలుకూ యూఆర్‌ఎల్స్
మొత్తాన్ని ఆమె పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఓ వ్యక్తిని అరెస్టు
చేసిన పోలీసులు సదరు సోషల్ మీడియా వేదికల నుంచి అదనపు సమాచారం కోరుతున్నారు.
Comments
Post a Comment