మూడు వేల రూపాయలతో వరంగల్ వచ్చి కోట్లు మోసం చేసిన ప్రియదర్శిని.. ఈవిడే.. ఆమె స్టోరీ..!
కేవలం మూడంటే.. మూడు వేల రూపాయలతో వరంగల్ కు వచ్చిన ఆ యువతి తక్కువ కాలంలోనే కొన్ని కోట్ల రూపాయలను మోసం చేసింది. ఇంతకూ ఆ యువతి ఎవరు అని చాలా మంది తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆమె చాలా మంది అబ్బాయిలను మోసం చేసే అవకాశం ఉంది. వరంగల్ లోని ప్రముఖ బిజినెస్ మ్యాన్ పుత్రుడు ఇచ్చిన కంప్లయింట్ తో పోలీసులు ఆమె విషయాన్ని బయటపెట్టారు.ఆమె పేరు ప్రియదర్శిని.. డబ్బున్న కుర్రాళ్ళకు మాత్రమే పరిచయం అవుతుంది. పరిచయమైన రెండో రోజే ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని అంటుంది. తన వద్ద రూ. 100 కోట్ల ఆస్తి ఉందని, నిన్ను విడిచి క్షణం కూడా ఉండలేనని, కాదంటే చచ్చిపోతానని చెబుతుంది. కొద్దిరోజుల్లోనే సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత పెళ్ళి చేసుకున్న వ్యక్తితో స్టార్ హోటళ్లలో మాత్రమే గడుపుతుంది. ఆ తర్వాత అందినంత నగదు, నగలు దోచుకుని మాయమవుతుంది. ఇలా పాప తన తెలివితో చాలా మంది యువకులను మోసం చేసింది. లక్షలు లక్షలు షాపింగ్ చేసి పారిపోయిందని మోసపోయిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు.. దీంతో విచారణ మొదలుపెట్టడంతో ఆమె చేసిన మోసం బయటకు వచ్చింది.చెన్నైలో పలువురు వ్యాపారులకు ప్రియదర్శిని టోకరా ఇచ్చిందని, చెల్లని చెక్కులతో ఖరీదైన బైకులు, కార్లు బుక్ చేసి, డబ్బులడిగితే కనిపించకుండా పోయిందని, ఆ యువతే, ఇప్పుడు వరంగల్ యువకుడిని మోసం చేసిందని ప్రాథమిక విచారణలో తేల్చారు.ప్రియదర్శిని అలియాస్ స్నేహ గురించిన మరిన్ని వివరాలను, ఆమె ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఆమె బెంగళూరు పారిపోయిందని సమాచారం అందుతోందని అన్నారు. డాక్టర్ గా పరిచయం చేసుకుని రూ. 5 లక్షలను, అతని స్నేహితుల నుంచి రూ. 10 లక్షలను ఆమె దొంగిలించిందని చెప్పారు. వరంగల్ లోని మహీంద్రా అండ్ మహీంద్రా షోరూములో రూ. 75 లక్షలకు చెక్కులిచ్చి నాలుగు కార్లు కొనుగోలు చేయగా, అవి బౌన్స్ అయ్యాయని వెల్లడించారు. హైదరాబాద్ లోని రాంనగర్ ప్రాంతంలో ఉన్నహ్యుందాయ్ షోరూములో 17 లక్షల చెక్కులిచ్చి ఓ కారును కొనుగోలు చేసింది. దీంతో ఈమె మోసాల చిట్టా చాలా పెద్దగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
Comments
Post a Comment