వెంకటేశ్, రానా.. వెబ్ సీరిస్, రాజీవ్ గాంధీపై?
దివంగత మాజీ ప్ఱధాని రాజీవ్ గాంధీ హత్యపై ఒక వెబ్ సీరిస్ రూపొందించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో తెలుగు ప్రముఖ నటులు, బాబాయ్ అబ్బాయి వెంకటేశ్, రానాలు ముఖ్య పాత్రల్లో నటించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రాజీవ్ హత్య గురించి ఎల్టీటీఈ గురించి చెప్పడానికి ఎంతో సమాచారం ఉంది… సినిమా రూపంలో దాన్ని చెప్పలేమని, అందుకే వెబ్ సీరిస్ గా రూపొందిస్తున్నట్టుగా దీని మేకర్లు ప్రకటించారు. ఏఎంఆర్ రమేశ్ దీనికి దర్శకత్వం వహిస్తాడని సమాచారం. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దీన్ని రూపొందించనున్నారని తెలుస్తోంది.
Comments
Post a Comment