పెళ్ళికి ముందు ముఖేష్ అంబానీకి ఒక షరతు విధించిన నీతా అంబానీ.. ఒప్పుకుంటేనే పెళ్ళి..!

పెళ్ళికి ముందు ముఖేష్ అంబానీకి ఒక షరతు విధించిన నీతా అంబానీ.. ఒప్పుకుంటేనే పెళ్ళి..!

ముకేష్ అంబానీ, నీతా అంబానీ.. భారతదేశంలోనే ధనిక జంట. అలాగని నీతా అంబానీ ఏమీ పెళ్ళికి ముందు ధనికురాలు కాదు. ఆమె మిడిల్ క్లాస్ అమ్మాయి..! వీరిద్దరి పెళ్ళికి ముఖ్య కారణం.. ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్. ఒక ఫంక్షన్ లో కోకిలా బెన్ నీతా అంబానీ డ్యాన్స్ చేయడం చూసింది. ఆ తర్వాత నీతా వివరాలు తెలుసుకుని.. అప్పుడు వారి కుటుంబసభ్యులతో మాట్లాడింది.నీతా స్వాతంత్ర్యత కలిగిన అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకోడానికి సమ్మతమే కానీ.. ఒక్క షరతు ఒప్పుకుంటేనే పెళ్ళి అని ముఖేష్ అంబానీకి చెప్పింది. ఆ షరతుకు ఒప్పుకుంటేనే పెళ్ళి చేసుకుంటా.. లేదంటే వేరే అమ్మాయిని చేసుకోమని తెగేసి చెప్పేసింది నీతా..!నీతా తన కాళ్ళ మీద తాను నిలబడాలని అనుకునే అమ్మాయి. తన ఖర్చులు, ఇంటి అవసరాల కోసం నీతా టీచర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేది. అప్పుడు ఆమె జీతం 800 రూపాయలు..! ఆమెకు పిల్లలు అన్నా పిల్లలకు చదువు చెప్పడం అన్నా కూడా ఎంతో ఇష్టం. అదే సమయంలో ముఖేష్ అంబానీని పెళ్ళి చేసుకోవాలనే ప్రపోజల్ వచ్చింది. దీంతో ముఖేష్ అంబానీతో నీతా మాట్లాడింది. పెళ్ళి అయిన తర్వాత కూడా నేను టీచర్ గా పనిచేయడానికి ఒప్పుకుంటేనే పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. దీనికి ముఖేష్ కూడా సమ్మతమేనని చెప్పడంతో పెళ్ళి చేసేసుకుంది. దేశంలోనే ధనిక కుటుంబానికి కోడలు అయిన తర్వాత కూడా నీతా టీచర్ గా పనిచేసింది.నీతా పెళ్ళి అయిన తర్వాత కూడా టీచర్ గా పనిచేస్తున్నప్పుడు ఓ విద్యార్థి తల్లిదండ్రులు 1987 వరల్డ్ కప్ కు సంబంధించిన టికెట్స్ ఇవ్వాలని చూశారు. అప్పుడు నీతా ఆ టికెట్స్ ను వద్దని చెప్పింది. అయితే మ్యాచ్ కు వెళ్ళి చూడగా నీతా ప్రెసిడెంట్స్ బాక్స్ లోని వీఐపి సీట్ లో కూర్చొని ఉండడం చూసి ఆ విద్యార్థి తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. అప్పుడు వాళ్లకు తెలిసొచ్చిన విషయం ఏమిటంటే ఆ ఏడాది వరల్డ్ కప్ ను స్పాన్సర్ చేస్తోందే రిలయన్స్ అని.. ఆ అంబానీ కుటుంబానికి కోడలు నీతా అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నీతా తన ఉపాధ్యాయ వృత్తికి గుడ్ బై చెప్పి.. ఫ్యామిలీ బిజినెస్ ను చూసుకుంటోంది. ప్రతి సంవత్సరం కొన్ని వేలమంది పిల్లలకు నీతా చదువుకొనే అవకాశం కల్పిస్తోంది.














Comments