తెరమీద కి వచ్చిన ఐశ్వ‌ర్యారాయ్ కుమారుడు..ఐవీఎఫ్ ద్వారా పుట్టాడ‌ట‌

తెరమీద కి వచ్చిన ఐశ్వ‌ర్యారాయ్ కుమారుడు..ఐవీఎఫ్ ద్వారా పుట్టాడ‌ట‌

మాజీ ప్ర‌పంచ సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్ కుమారుడినంటూ ఓ కుర్రాడు క‌ర్ణాట‌క‌లోని మంగ‌ళూరులో హ‌ల్‌చ‌ల్ చేశాడు. ఐశ్వ‌ర్యారాయ్‌కు తాను ఐవీఎఫ్ విధానం ద్వారా 1988లో లండ‌న్‌లో పుట్టాన‌ని చెబుతున్నాడు.త‌న పేరు సంగీత్ కుమార్ రాయ్ అని అంటున్నాడు. విశాఖ‌ప‌ట్నం జిల్లా చోడ‌వ‌రంలో తాను ఇన్నాళ్లూ నివ‌సించాన‌ని, తాను ఐశ్వ‌ర్యా రాయ్ కుమారుడినేన‌ని పూర్తి సాక్ష్యాధారాల‌ను సేక‌రించిన త‌రువాతే ఈ విష‌యాన్ని చెబుతున్నాన‌ని అంటున్నాడు.రెండేళ్ల వ‌య‌స్సులో త‌న‌ను ముంబైకి తీసుకెళ్లార‌ని ఆ కుర్రాడు చెబుతున్నాడు. త‌న అమ్మ‌మ్మ పేరు బ్రింద్యా కృష్ణ‌రాజ రాయ్ అని, తాత పేరు కృష్ణ‌రాజ రాయ్ అని చెప్పాడు.కృష్ణ‌రాజ రాయ్ ప్ర‌స్తుతం జీవించి లేర‌ని అన్నాడు. త‌న పుట్టుక‌కు సంబంధించిన రికార్డుల‌ను బంధువులు ధ్వంసం చేశార‌ని, అయిన‌ప్ప‌టికీ.. కొన్ని సాక్ష్యాధారాల‌ను సాధించ‌గ‌లిగాన‌ని అంటున్నాడు.ఇన్నేళ్లూ త‌న త‌ల్లిని చాలా మిస్ అయ్యాన‌ని, ఇప్పుడు ఆమెతో క‌లిసి ఉండాల‌ని కోరుకుంటున్నట్లు చెబుతున్నాడు. త‌న త‌ల్లి ఐశ్వ‌ర్యారాయ్‌ను క‌లుసుకోవ‌డానికి ఉబ‌లాట ప‌డుతున్నాన‌ని అంటున్నాడు.





Comments