పచ్చినిజం: కారు అతివేగానికి 6 కోట్ల ఫైన్
నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపితే ఏం జరుగుతుంది? మహా అయితే.. ఫైన్ వేస్తారు.. అంటూ సమాధానం చెబుతారు. మన దగ్గర అలా కానీ.. స్విట్జర్లాండ్ లో మాత్రం భిన్నమైన రూల్ ను అమలు చేస్తున్నారు. ఎంత వేగంగా కారునడిపితే అంత భారీగా జరిమానా విధించటం అక్కడ అలవాటు. ఫైన్ వేసే వేళ.. తప్పు చేసిన వ్యక్తి సంపాదన ఆధారంగా మరింత ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
ఆ మధ్యన స్విట్జర్లాండ్ లో ఒక పెద్ద మనిషి కారును వాయువేగంతో నడుపుతున్నాడు.గంటకు 180 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతుండగా పోలీసులు అతడ్ని పట్టుకున్నారు. అతగాడి ఆర్థిక పరిస్థితిని చెక్ చేసిన అక్కడి అదికారులు అతనికి వేసిన ఫైన్ ఎంతో తెలుసా? అక్షరాల రూ.6.49 కోట్లు.
అక్కడున్న రూల్స్ ప్రకారం జరిమానా వేయటంతో కిక్కురుమనకుండా ఆ మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. అదే తీరులో హైదరాబాద్ మహానగరంలోనూ ఇష్టారాజ్యంగా వాహనాల్నినడిపే వారికి.. నిర్ణీత మొత్తంలో ఫైర్ వేయకుండా.. వారు చేసిన తప్పు.. వారు వెళుతున్న స్పీడ్ ను లెక్క వేసి వారికి భారీ జరిమానాలు వేస్తే దెబ్బకు దారిలోకి రావటం ఖాయం. ఈ తరహా శిక్షను హైదరాబాద్ పోలీసులు ఆలోచించి.. రూల్ కిందకు మారిస్తే.. రోడ్ల మీద ఇష్టారాజ్యంగా ప్రయాణించే వారికి చెక్ పడటం ఖాయం. ఐడియా రెఢీగాఉంది.. ఇక దాన్ని పరిశీలించి.. మనకు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేస్తే బాగుంటుందని చెప్పక తప్పదు.
Comments
Post a Comment