5కోట్ల రూపాయల విలువ చేసే నోట్లు.. కానీ ఏమి లాభం..!
ఆ మూటల బరువే దాదాపు 100కిలోలు.. అందులోని డబ్బుల విలువ 5 కోట్ల రూపాయలకు పైగానే.. కానీ ఏమి లాభం.. వాటన్నిటినీ చిన్న చిన్నగా కత్తిరించి.. మూటల్లో కుక్కి పడేశారు. జార్ఖండ్ రాష్ట్రం లోని దినాయీ గ్రామంలో ఈ మూటలు కనిపించాయి. అందులో ఉన్నవి 500 మరియు 1000 రూపాయల నోట్లే..! అధికారుల అంచనా ప్రకారం ఆ మూటల్లో 5 కోట్ల రూపాయల డబ్బు ఉందట..!ఎన్-హెచ్ 33కి దగ్గరగా దినాయీ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలోని ఓ కల్వర్ట్ వద్ద మూడు మూతలు ఉన్నాయి. ఆడుకోడానికి వెళ్ళిన యువకులు ఆ మూటలను చూశారు. ఆ మూటల్లో ఏవో చిత్తుకాగితాలు ఉన్నాయని మొదట అనుకున్నారు. తీరా చూస్తే రద్దైన 500, 1000 రూపాయల నోట్లు..! దీంతో ఆ యువకులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్లు ఇప్పుడు పారేసినవా లేక ఎప్పుడైనానా అని పోలీసులు విచారణ మొదలుపెట్టారు. నోట్ల రద్దు జరిగిన సంవత్సరం తర్వాత కూడా పాత నోట్లు బయటకు వస్తూ ఉండడం ఆశ్చర్యకరం.
Comments
Post a Comment