లాస్ట్ ఇయర్ లాగానే…డిసెంబర్ 31 న “మోడీ” మరో సంచలన నిర్ణయం.? మాట్లాడబోయేది ఇదేనా..?

లాస్ట్ ఇయర్ లాగానేడిసెంబర్ 31 మోడీమరో సంచలన నిర్ణయం.? మాట్లాడబోయేది ఇదేనా..?


పెద్ద నోట్ల రద్దు తో నల్లదనం బయటికి వస్తుంది అని ఆశపడిన ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి..రోడ్లపై నల్లదనం కుప్పగా పడిఉంటుంది అని భావించిన ప్రజలు  ,రోజువారి అవసరాలు తీర్చుకోవడానికి నోట్ల కోసం ఎటిఎంల ముందు క్యూలు కట్టాల్సిన పరిస్థితి..పెద్దనోట్ల రద్దే కాదు.. జీఎస్టీ అమలు, ఆన్ లైన్ ట్రాన్జాక్షన్లు ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో సంస్కరణలు..  అన్నింటి విషయంలోనూ జనం విసిగిపోయి ఉన్నారు.మోడి ఏ టైం కి ఏ నిర్ణయం తీసుకుంటారో అని దేశం అంతా టెన్షన్ తో ఉంటే..మరోసారి డిసెంబర్ 31న మోడి సంచలన నిర్ణయం తీసుకోనున్నారనే వార్తలొస్తున్నాయి.. తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకోవ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం సిద్ద‌మైన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక‌టి బ్యాంక్ చెక్స్ ను పూర్తిగా ర‌ద్దు చేసే దిశ‌గా మోదీ అడుగులు వేస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. డిజిట‌ల్ ఇండియా వైపుగా అడుగులు వేస్తున్న మోఢీ ప్ర‌భుత్వం బ్యాంకింగ్ కార్యక‌లాపాల‌న్నీ ఆన్ లైన్ ద్వారా జ‌రిగే విధంగా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తోంది. ఇక భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ణా నైట్ తొమ్మిది గంట‌ల త‌ర్వాత ఏటీఎంలు మూసివేయాల‌ని నిర్ణయించిన‌ట్లు గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. డిసెంబ‌ర్ 31న జాతిని ఉద్దేశించే మోఢీ చేయ‌నున్న ప్ర‌సంగంలో మ‌రో షాకింగ్ నిర్ణయం ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నోట్ల ర‌ద్దు, బంగారం, బినామీ ఆస్తుల‌పై మోఢీ కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తార‌ని కొంత‌మంది అంటున్నారు. అలాగే జ‌న్ థ‌న్ అకౌంట్స్ ఉన్న వారికి ప‌దివేలు వేస్తామ‌ని గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం తెలిపిన విష‌యం తెలిసిందే. డిసెంబర్ 31న ప్ర‌సంగంలో దీని గురించి ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని చాలా మంది ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు. మ‌రి డిసెంబ‌ర్ 31న మోఢీ ఏం నిర్ణయాలు ప్ర‌కటిస్తారో వేచి చూడాలి.





Comments