బాహుబలి-2 రష్యన్ ట్రైలర్ అదుర్స్..
బాహుబలి ది బిగినింగ్, బాహుబలి2 ది కన్‌క్లూజన్ చిత్రాలు దర్శకుడు రాజమౌళికి,యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డాషింగ్ హీరో రానా దగ్గుబాటికి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. ఈ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులను తిరుగరాస్తూ 1000 కోట్ల క్లబ్లో చేరిన దక్షిణాది చిత్రంగా బాహుబలి2 రికార్డు సృష్టించింది. తాజాగా జపాన్‌లో రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ రష్యా వెర్షన్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.బాహుబలి2 సినిమా రిలీజై ఏడు నెలలు గడిచినా గానీ ఇంకా ఆ మధురస్మృతులు మది నుంచి తొలగిపోవడం లేదు. బాహుబలి చిత్రం కేవలం తెలుగు వాళ్లనే కాదు.. దేశంలోని సినీ ప్రేక్షకులందరినీ మొత్తాన్ని ఉర్రూతలూగించింది.బాహుబలి2 సినిమా బాలీవుడ్ చిత్రాలు సుల్తాన్, దంగల్ సినిమాల రికార్డులను తిరగరాసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రికార్డు సృష్టించిన బాహుబలి జపాన్‌లో కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. బాహుబలి2 చిత్రం డిసెంబర్ 29న రిలీజ్‌కు సిద్దమవుతున్నది.
బాహుబలి2 జపాన్ రిలీజ్‌కు ఏర్పాట్లు జరుగుతుండగా, చైనా, రష్యన్ భాషలో ఈ సినిమా ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన రష్యన్ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు.
Comments
Post a Comment