వాహనదారులకు గుడ్ న్యూస్…లీటర్ రూ. 22 మాత్రమే..!
రాను రాను పెట్రోల్ ధర కొండెక్కుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు దీని రేటు పెరుగుతూనే ఉంది. కానీ తగ్గడం లేదు. ఒక వేళ తగ్గినా మళ్లీ పెట్రోల్ రేటును పెంచుతున్నారు. దీంతో పెరిగిన రేట్లతో జనాలు వాహనాలను నడపలేకపోతున్నారు. అయితే త్వరలో ఈ బాధలు జనాలకు తీరనున్నాయి. అంటే.. పెట్రోల్ ధరలు తగ్గిస్తారా..? అంటే.. లేదు.. కానీ పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా మరో తరహా ఇంధనాన్ని అందుబాటులోకి తేనున్నారు. దాని పేరు మిథనాల్. త్వరలో పెట్రోల్ తరహాలో మిథనాల్‌ను విక్రయించనున్నారు. దీంతో లీటర్ ఇంధనం రూ.22 మాత్రమే అవుతుంది. ఫలితంగా పెట్రోల్ రేట్లు కూడా దిగి వస్తాయట.కేంద్ర ప్రభుత్వం తాజాగా మిథనాల్ పాలసీని ప్రకటించింది. దీని వల్ల బొగ్గు నుంచి ఉత్పత్తి అయ్యే మిథనాల్ మిశ్రమాన్ని 15 శాతం మోతాదులో పెట్రోల్‌లో కలుపుతారు. దీంతో మిథనాల్ ఇంధనం తయారవుతుంది. ఇక ఇలా తయారైన ఇంధనం ధర లీటర్‌కు రూ.22 మాత్రమే అవుతుంది. చైనాలో రూ.17కే ఈ ఇంధనాన్ని తయారు చేస్తున్నారు. దీంతో ఇలా తక్కువ రేటుకే త్వరలో భారత్‌లోనూ మిథనాల్‌ను తయారు చేయనున్నారు.మన దేశంలో దీపక్ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (ఆర్సీఎఫ్) సహా ముంబై చుట్టు పక్కల ఉన్న చాలా కర్మాగారాలు మిథనాల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే స్వీడన్ ఆటో మేజర్ వోల్వో కంపెనీ మిథనాల్‌తో నడిచే స్పెషల్ ఇంజిన్‌ను కూడా రూపొందించింది. దీంతో లోకల్‌గా తయారైన ఇంధనంతో 25 బస్సులను త్వరలో నడపనున్నారు. త్వరలోనే ఈ ప్రయోగాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో మిథనాల్‌ను వాడడం వల్ల పెట్రోల్ ధరలు కూడా తగ్గుతాయని అంటున్నారు. అయితే మిథనాల్ వల్ల మనకు కలిగే లాభాలు ఏమిటంటే… ఈ ఇంధనంతో ఇంజిన్ నుంచి శబ్దం ఎక్కువగా రాదు. వాహనం నుంచి పొగ కూడా రాకుండా ఉంటుంది. కాలుష్యం తక్కువవుతుంది. పైగా వాహనం మైలేజీ పెరుగుతుంది. అయితే మిథనాల్ ఎప్పటి నుంచి మనకు అందుబాటులోకి వస్తుందో వేచి చూడాలి..!
Comments
Post a Comment