పిల్లలకు రూ. 15వేలు, పెన్షన్ రూ.2వేలు: జగన్, విప్లవాత్మక నిర్ణయాలు

పిల్లలకు రూ. 15వేలు, పెన్షన్ రూ.2వేలు: జగన్ విప్లవాత్మక నిర్ణయాలు



ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ధనియాల చెరువు వద్దకు చేరుకున్న ఆయన.. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో తాగడానికి నీళ్లు దొరకడం లేదు గానీ, ఫోన్ చేస్తే మాత్రం మద్యం బాటిళ్లే ఇంటికి చేరుతున్నాయని జగన్ ఎద్దేవా చేశారు. బెల్టు షాపులు తొలగిస్తామన్న చంద్రబాబు.. ప్రజల ఇంటిపక్కకే వస్తున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని చెప్పారు. పిల్లలను చదివిస్తే ఏడాదికి రూ.15వేలు వారి అకౌంట్లలో వేస్తామని జగన్ అన్నారు. అంతేగాక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 45ఏళ్లకే పింఛన్ ఇస్తామని, అది కూడా రూ.2వేల చొప్పున అందజేస్తామని జగన్ చెప్పారు.



Comments