13 ఏళ్ల వయసులో రెండు చేతులు పోగొట్టుకుంది...PhD Thesis ఎలా రాసిందో తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే.!

13 ఏళ్ల వయసులో రెండు చేతులు పోగొట్టుకుంది...PhD Thesis ఎలా రాసిందో తెలుస్తే ఫిదా అవ్వాల్సిందే.!


జీవితంలో ఎన్ని క‌ష్టాలు ఎదురైనా ముందుకే సాగాలి త‌ప్ప వెనుక‌డుగు వేయ‌కూడదు. అంగ వైక‌ల్యం క‌లిగింద‌ని బాధ ప‌డ‌కూడ‌దు. దాన్ని జ‌యించాలి. విజ‌యం దిశ‌గా ముందుకు సాగాలి. ల‌క్ష్య సాధ‌న‌కు కృషి చేయాలి. అప్పుడు క‌చ్చితంగా ఏదో ఒక రోజు అనుకున్న‌ది సాధిస్తారు.. స‌రిగ్గా ఇలా అనుకుంది కాబ‌ట్టే.. ఆ యువ‌తి త‌న 13వ ఏట బాంబ్ బ్లాస్ట్‌లో రెండు చేతుల‌ను కోల్పోయినా ఇప్పుడు పీహెచ్‌డీ సాధించింది. త‌న‌లాంటి ఎంద‌రికో ప్రేర‌ణ‌గా నిలుస్తోంది. ఆమే… బిక‌నీర్‌కు చెందిన మాళ‌వికా అయ్య‌ర్‌.…

మాళ‌వికా అయ్య‌ర్‌ది త‌మిళ‌నాడులోని కుంభ కోణం ప్రాంతం. అక్క‌డే పెరిగింది. కానీ తండ్రికి బిక‌నీర్ కు ట్రాన్స్‌ఫ‌ర్ అయింది. అత‌ను వాట‌ర్ వ‌ర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తాడు. దీంతో అత‌నికి బిక‌నీర్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అవ‌గా ఆమె కూడా త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి బిక‌నీర్‌కు వెళ్లింది. అక్క‌డ చ‌దువుకుంటుండ‌గా 2002, మే 26న త‌మ‌ ఇంటి వ‌ద్ద జ‌రిగిన బాంబ్ బ్లాస్ట్‌లో ప్ర‌మాద‌వ‌శాత్తూ మాళివిక‌కు రెండు చేతులు పోయాయి. అప్పుడు ఆమెకు 13 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. దీంతో ఆ ఘ‌ట‌న కార‌ణంగా 18 నెల‌ల పాటు హాస్పిట‌ల్‌లో ఆమె ఉంది.అయితే హాస్పిట‌ల్ నుంచి వ‌చ్చినా త‌న‌కు రెండు చేతులు పోయాయని ఆమె ఎప్పుడూ బాధ‌ప‌డ‌లేదు. పైగా త‌న‌కంటూ ఓ ల‌క్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంది. దాని కోసం శ్ర‌మించింది. రెండు చేతులు లేక‌పోయినా రాయ‌డం, టైప్ చేయ‌డం ప్రాక్టీస్ చేసింది. అందుకు ఆమె ఎంత‌గానో క‌ష్ట‌ప‌డింది. అయితే చివ‌ర‌కు ఆమె త‌న 28వ ఏట పీహెచ్‌డీ పూర్తి చేసింది. దీంతో ఎట్ట‌కేల‌కు తాను అనుకున్న‌ది సాధించింది. అయితే ఆమె పీహెచ్‌డీ పూర్తి చేయ‌డ‌మే కాదు, త‌న‌లాంటి వారికి ప్రేర‌ణ‌గా కూడా నిలుస్తోంది. అనేక కార్య‌క్ర‌మాల్లో అంగ వైకల్యం ఉన్న‌వారిలో స్ఫూర్తిని నింపేలా ఈమె ఉప‌న్యాసాలు కూడా ఇస్తోంది. ఏది ఏమైనా.. మాళవిక సాధించిన ఘ‌న‌త‌కు ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే క‌దా..!




Comments