జనవరి 1న ప్రభుత్వాసుపత్రిలో పుట్టే మొట్టమొదటి ఆడపిల్లకు బంపర్ ఆఫర్!
జనవరి 1వ తేదీన బెంగళూరులో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సహజ ప్రసవం ద్వారా పుట్టే మొట్టమొదటి ఆడబిడ్డకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.ఆ పాపకు డిగ్రీ వరకూ ఉచితంగా చదివిస్తామని బృహత్ బెంగళూరు నగర పాలికే మేయర్ ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, ఆడపిల్లలకు విద్యను అందించడం వంటి చర్యల్లో భాగంగా ఈ ఆఫర్‌ను ప్రకటించినట్టు మేయర్ చెప్పారు.సాధారణ కాన్పు ద్వారా జన్మించిన ఆ తొలి బిడ్డ పేరు మీద, నగర కమిషనర్ పేరిట జాతీయ బ్యాంకులో ఓ ఉమ్మడి అకౌంట్‌ను తెరుస్తారు. అందులో అయిదు లక్షల రూపాయలను డిపాజిట్ చేస్తారు.దానిపై వచ్చే వడ్డీని ఆ అమ్మాయి చదువుకు వినియోగిస్తామనిని మేయర్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం రోజు పుట్టిన తొలి బిడ్డను ఎంపిక చేసేందుకు ప్రతి ఆస్పత్రిలోనూ వైద్య సిబ్బంది ప్రసవ సమయాలను నమోదు చేస్తారు.అలా పుట్టిన వారి నుంచి తొలుత జన్మించిన ఆడ పిల్లను ఎంపిక చేస్తారు. సిజేరియన్ ద్వారా జన్మించిన బిడ్డకు ఇది వర్తించదని మేయర్ సంపత్‌రాజ్ చెప్పారు.
Comments
Post a Comment