యాంకర్ ప్రదీప్ కు విధించిన శిక్ష.. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ప్రదీప్ ఇచ్చిన జవాబు ఇదే..!
ఈ ఏడాది జనవరి 1న డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ప్రముఖ యాంకర్ ప్రదీప్ చాలా రోజులుగా కోర్టుకు హాజరు కాకుండా ఉన్నాడు. తాజాగా ప్రదీప్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. అతడికి రెండు రోజుల నుండి.. వారం రోజుల పాటు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు అన్నారు. అయితే అదేమీ కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ ను మూడేళ్ల పాటు రద్దు చేస్తూ నాంపల్లి న్యాయస్థానం తీర్పు నిచ్చింది. లైసెన్స్ రద్దు చేయడంతో పాటు ప్రదీప్ కు రూ.2,100 జరిమానా కూడా విధించింది.‘డ్రంకెన్ డ్రైవ్ కు వ్యతిరేకంగా మీడియాలో ప్రచారం చేసిన మీరు మద్యం సేవించి వాహనం నడిపితే ఎలా?’ అని ప్రదీప్ ను న్యాయమూర్తి ప్రశ్నించినట్టు సమాచారం. ‘ఆ రోజు డ్రైవర్ లేనందున నేనే కారు డ్రైవ్ చేశాను’ అని ప్రదీప్ సమాధానం చెప్పారట. దీంతో ప్రదీప్ మరో మూడేళ్ళ పాటూ కారు స్టీరింగ్ పట్టడానికి వీల్లేదన్నమాట.




Comments
Post a Comment