మాజీ భార్యను పెళ్లాడనున్న హీరో!

మాజీ భార్యను పెళ్లాడనున్న హీరో!

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌.. భార్య సూసాన్నే ఖాన్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు మగపిల్లలు. వారి కోసమే ఇద్దరూ అప్పుడప్పుడూ పార్టీలు, విహారయాత్రల్లో కలుస్తుంటారు. అయితే..వీరిద్దరి మధ్య ఇప్పుడు ఎలాంటి మనస్పర్థలు లేవని ఇద్దరూ కలిసిపోవాలనుకుంటున్నారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇందుకోసం హృతిక్‌..సుసాన్నేను మరోసారి వివాహం చేసుకోవాలనుకుంటున్నాడట. అదీకాకుండా ఇటీవల హృతిక్‌ తన పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సుసాన్నే తన మాజీ భర్తకు విషెస్‌ చెప్తూ..‘ఎప్పటికీ నా జీవితంలో నువ్వే సన్‌షైన్‌. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలి.’ అని ట్వీట్‌ చేస్తూ హృతిక్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసింది. హృతిక్‌ ఏర్పాటు చేసిన బర్త్‌డే పార్టీకి కూడా వెళ్లింది.అంతేకాదు..హృతిక్‌, కంగనా రనౌత్‌ వివాదంలో ఆమె తన మాజీ భర్తకే మద్దతుగా నిలిచింది. దాంతో వీరిద్దరూ మరోసారి వైవాహిక బంధంలోకి ప్రవేశించాలని భావిస్తున్నారు. వీలైతే ఈ ఏడాదిలోనే ఇద్దరూ మరోసారి వివాహం చేసుకునే అవకాశం ఉందని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం హృతిక్‌ ‘సూపర్‌ 30’ సినిమాలో నటిస్తున్నాడు. వికాస్‌ బెహల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క ‘క్రిష్‌ 4’ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లోనూ బిజీగా ఉన్నాడు. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.



Comments