స్మశానంలో హీరో పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన అభిమానులు.. ఎవరి ప్రేమ వారిది..!

స్మశానంలో హీరో పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన అభిమానులు.. ఎవరి ప్రేమ వారిది..!


ఇష్టమైన హీరో పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఎక్కడ నిర్వహిస్తారు చెప్పండి. ఏ స్కూల్ లోనో, ఆసుపత్రి లోనో, రోడ్ల మీదనో.. అలా అన్నమాట. కానీ ఓ హీరో పుట్టినరోజు మాత్రం స్మశానంలో నిర్వహించారు. నిజమండీ ఎక్కడో కాదు మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో.. కన్నడ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలలో దునియా విజయ్ కూడా ఒకరు. ఆయన పుట్టినరోజు వేడుకలు స్మశానంలో నిర్వహించారు ఆయన అభిమానులు.దునియా విజయ్ 44వ పుట్టినరోజు సందర్భంగా కర్ణాటక రాష్ట్రం లోని గదగ జిల్లాలోని అడవి సోమాపుర గ్రామంలో అభిమానులు స్మశానంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో స్మశానానికి చేరుకున్న అభిమానులు కొద్ది సేపు నిప్పులు మండించి.. ఆ తర్వాత కేక్ కోసి విజయ్ ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. అలాగే పోస్టర్ కు పాలాభిషేకం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు దునియా విజయ్ అభిమానులు పాల్గొన్నారు.





Comments