కత్తి మహేష్ లవ్ స్టోరీ.. అతని భార్య, పిల్లల గురించి కాస్త సమాచారం.

కత్తి మహేష్ లవ్ స్టోరీ.. అతని భార్య, పిల్లల గురించి కాస్త సమాచారం.


పవన్ కళ్యాణ్ అభిమానులతో కత్తి మహేష్ వివాదానికి నేటితో తెరపడింది. ఇంతగా పోరాడిన కత్తి మహేష్ వ్యక్తిగత జీవితంలో కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. ఆయనది ప్రేమ వివాహమట. అది కూడా సోషల్ మీడియా ద్వారా ఆమెతో పరిచయం పెంచుకున్న కత్తి మహేష్.. పెళ్ళిదాకా తీసుకొని వెళ్ళాడు. కోల్‌కతా యువతి సొనాలిని ఛాటింగ్ ద్వారా పరిచయం చేసుకుని ప్రేమ వివాహం చేసుకున్నాడని ఓ పత్రిక ప్రచురించింది. ప్రస్తుతం ఆమె లక్నోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు పుట్టాడు. ప్రస్తుతం ఆ బాబుకి ఎనిమిదేళ్లు. ఆ పిల్లాడు తల్లి వద్దే ఉంటూ చదువుకుంటున్నాడు. ఇక కత్తి మహేష్ సొంత ఊరు చిత్తూరు జిల్లాలోని ఎల్లమంద కాగా, ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కత్తి మహేశ్ తండ్రి కత్తి ఓబులేశు ప్రస్తుతం సొంత ఊరైన ఎల్లమందలోనే నివసిస్తుండగా, కత్తి మహేశ్ తల్లి సరోజమ్మ ఏడాదిన్నర క్రితం కేన్సర్‌తో బాధపడుతూ మృతి చెందారు. ఇక కత్తి మహేశ్‌కి కత్తి రవికుమార్ అనే సోదరుడు ఉన్నారు. ఆయన బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కత్తి మహేశ్ సోదరి వాణిశ్రీ సికింద్రాబాద్‌లో న్యూట్రిషనిస్ట్‌. ఇదండీ కత్తి మహేష్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.





Comments