వెండితెర రారాజు

వెండితెర రారాజు 


జెమినీ గణేశన్‌ కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌గా పేరు సంపాదించారు. వెండితెరపై ఆయన పోషించిన పాత్రలే ఆ గుర్తింపుని తీసుకొచ్చాయి. ఎన్నో ప్రేమకథల్లో ఒదిగిపోయి ప్రేక్షకులకు చేరువైన ఆయన వ్యక్తిగత జీవితం కూడా సినిమాని తలపిస్తుంటుంది. ప్రముఖ నటి సావిత్రిని వివాహమాడిన ఆయన దశాబ్దాలపాటు వెండితెరని ఏలారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’లో జెమినీ గణేశన్‌ పాత్ర కీలకం. ఆ పాత్రని యువ కథానాయకుడు దుల్కర్‌ సల్మాన్‌ పోషించాడు. సావిత్రిగా కీర్తి సురేష్‌ నటిస్తుండగా.. సమంత, విజయ్‌ దేవరకొండ, మోహన్‌బాబు ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. జెమినీ గణేశన్‌ పాత్ర నేపథ్యంలో సాగే  సన్నివేశాల చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. దాంతో చిత్రబృందం ఆయన లుక్‌ని ట్విట్టర్‌ ద్వారా విడుదల చేసింది. జెమినీ గణేశన్‌ పాత్రలో సహజత్వం ఉట్టిపడేలా  కనిపిస్తున్నాడు దుల్కర్‌.


Comments