ఖుష్బూ తన తండ్రిని ఎప్పటికీ క్షమించదట.. ఆయన్ను చూడాలని ఏ రోజూ అనుకోలేదు, చూడను కూడా.
ఖుష్బూ.. ఇటీవల వచ్చిన అజ్ఞాతవాసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది. కోలీవుడ్ లో గుడి కట్టించుకున్న హీరోయిన్ ఎవరంటే మొదటి పేరు కుష్భూ అనే అంటారు. చిన్న వయసులోనే హీరోయిన్ అయ్యి.. ఆ తర్వాత పలువురు స్టార్స్ పక్కన నటించింది. అలాంటి ఖుష్భూ జీవితంలో జరిగిన ఓ విషయం ఇప్పటికీ తేదీతో సహా గుర్తుపెట్టుకుంది. తన తండ్రిని 30 ఏళ్ళు అయినా క్షమించనని.. ఆయన మొఖం చూడాలని అనుకోలేదని.. చూడను కూడా అని చెప్పుకొచ్చింది.తాను చిన్నవయసులో ఉన్నప్పుడు తన తండ్రి విచక్షణ లేని వ్యక్తని ఆమె అన్నారు. ఆయన అసభ్యంగా దూషించే భర్త అని, మహిళల్ని ఆయన కించపరిచే తీరు నచ్చక, ఆయనకు ఎదురు తిరిగానని చెప్పుకొచ్చింది. కుటుంబం నుంచి అమ్మ, సోదరుడ్ని తీసుకుని బయటకు వచ్చేశానని ఆమె వెల్లడించారు. ‘నాకు ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది, 1986 సెప్టెంబరు 12వ తేదీన ఇంట్లో వాగ్వాదం చోటు చేసుకుంది. అమ్మను అనరాని మాటలంటుంటే ఎదురుతిరిగి బయటకు వచ్చేశాను’ అని చెప్పింది.అప్పుడు మా నాన్న నువ్వు పాక్కుంటూ వెళ్లి బిక్షాటన చేసి, డబ్బు తీసుకొచ్చి పోషిస్తావా? అని ప్రశ్నించగానే.. నా సోదరుడ్ని, అమ్మను చంపేసి.. నేనూ రైలు కిందపడిపోతానే కానీ మళ్లీ నీ దగ్గరికి తిరిగి రాను అని ఆయనతో సవాల్ చేసి, బయటకు వచ్చేసిందట ఖుష్బూ.
Comments
Post a Comment