ట్రంప్ గారూ.. కూతుర్ని ముద్దు పెట్టుకోవడం అలాగేనా.. ఇవాంకతో ముద్దుపై నిజమిదే.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలన గురించి
ఏమో కానీ వివాదాల గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు జనాలు. కొద్ది రోజుల క్రితం
మెలానియాను పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా పోర్న్ స్టార్ తో సంబంధం
పెట్టుకున్నాడన్న వార్తలు బయటకొచ్చి ట్రంప్ బృందాన్ని ఇబ్బందులకు గురిచేశాయి.
తాజాగా కూతురు ఇవాంకా ట్రంప్ ను ఓ సమావేశంలో ముద్దు పెట్టుకోవడంపై తీవ్ర చర్చ
జరుగుతోంది. ట్రంప్ తన కూతురును ముద్దు
పెట్టుకోవడంపై ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆసభ్యకరంగా కూతురిని
ముద్దు పెట్టుకున్నాడని కొందరు తెగ షేర్ చేస్తున్నారు. అలాగే ట్రంప్ కు కూతురిని
ఎలా ముద్దు పెట్టుకోవాలో కూడా తెలీదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆ
ఫోటోగ్రాఫర్ చేసిన తప్పు అది. కానీ ఆ వీడియోలో మాత్రం ఇవాంకా ట్రంప్ చెంపపై
డొనాల్డ్ ట్రంప్ ముద్దు పెట్టుకున్నట్లు స్పష్టంగా తేలిపోతుంది. పాపం ట్రంప్ ఏది
చేసినా చెడుగా ఆలోచించేవాళ్ళే ఎక్కువయ్యారు. అలాగని ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన్ను వెంటాడుతూనే
ఉన్నాయి. ఇవాంకా అందాన్ని పొగుడుతూ కూడా గతంలో అడ్డంగా బుక్ అయిపోయాడు. అలాగే 2006
లో ఇవాంకా తన కూతురు కాకపోయింటే ఖచ్చితంగా తనతో డేటింగ్ చేసేవాన్ని అని
చెప్పుకోవడం కూడా వివాదం అయిపోయింది. 36 సంవత్సరాల ఇవాంక ట్రంప్ ట్రంప్ సలహాదారుగా
పనిచేస్తోంది.



Comments
Post a Comment