మృతదేహం కూడా దొరక్కపోవడంతో..ఫొటోకు అంత్యక్రియలు చేసిన తల్లి.
ఓ యువతిని
గ్యాంగ్‌రేప్ హతమార్చారు కొందరు కిరాతకులు. ఆమె మృతదేహాన్ని కూడా మాయం
చేసేశారు. అంత్యక్రియలు నిర్వహించడానికి తన కుమార్తె మృతదేహం కూడా దొరకలేదు.దీనితో
మృతురాలి తల్లి.. తన కుమార్తె ఫొటోకు అంతిమ సంస్కారాలు చేసిన ఘటన ఇది.
జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.ఈ విషయంలో పోలీసుల
నిర్లక్ష్యం కూడా వెలుగు చూసింది. మృతురాలి ఆచూకీ కనుగొనాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా
వ్యవహరించారు.అనాథ మృతదేహంగా గుర్తించి, వారే అంత్యక్రియలు చేశారు. ఈ విషయం తెలిసిన
తల్లి గుండె పగిలింది. మృతురాలి పేరు కిరణ్‌కుమారి.రామ్‌గఢ్ జిల్లాలోని భదానినగర్‌లో
నివసించే కిరణ్‌కుమారి కిందటి నెల 6వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీనిపై ఆమె తల్లి సుమన్ స్థానిక పోలీస్
స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటికీ..
అది నత్తకే నడకలు నేర్పించింది. డిసెంబర్ 15వ తేదీన కిరణ్‌కుమారి మృతదేహం లభించింది.చేతులు,
కాళ్లు కట్టేసిన స్థితిలో
ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రాథమిక దర్యాప్తు పూర్తి
చేసి.. అనాథ మృతదేహంగా దహన సంస్కారాలను నిర్వహించారు.ఈ కేసులో బొకారో జిల్లా
పోలీసులు ఆదిల్ అనే యువకుడిని అరెస్టు చేశారు. కిరణ్‌కుమారిని ప్రేమ పేరుతో
వంచించి, తన స్నేహితులతో
కలిసి ఆమెను గ్యాంగ్ రేప్ చేసినట్టుగా ఆదిల్ అంగీకరించాడు.ఈ కేసులో ఆదిల్
కుటుంబీకులను కూడా నిందితులుగా గుర్తించారు పోలీసులు.తన కుమార్తె మృతదేహానికి
పోలీసులే అంత్యక్రియలు చేసిన విషయం తెలుసుకున్న తల్లి సుమన్ విషాదంలో
మునిగిపోయారు. గతంలో ఓ సారి ఆదిల్ తన కుమార్తెతో కలిసి ఇంటికి కూడా వచ్చాడని
సుమన్ చెప్పారు.
Comments
Post a Comment